Hindenburg was in India: ’హిండెన్‌బర్గ్’ భారతదేశంలో ఉంటే.. అదే జరిగేది : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు

MIM ఎంపీ,ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు లోక్ సభలో గౌతమ్ అదానీ కంపెనీలను పాతాళంలోకి నెట్టేసిన ‘హిండెన్ బర్గ్’ నివేదికను ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "హిండెన్‌బర్గ్’’ భారతదేశంలో ఉంటే..అదే జరిగేది అంటూ ఒవైసీ..

Hindenburg was in India: ’హిండెన్‌బర్గ్’ భారతదేశంలో ఉంటే.. అదే జరిగేది  : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు

''Hindenburg in India_..Owaisi Said

”Hindenburg” in India”MP Owaisi comments : MIM ఎంపీ,ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు లోక్ సభలో గౌతమ్ అదానీ కంపెనీలను పాతాళంలోకి నెట్టేసిన ‘హిండెన్ బర్గ్’ నివేదికను ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “హిండెన్‌బర్గ్’’ భారతదేశంలో ఉంటే..చట్టవిరుద్ధ చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని సెటైర్ వేశారు. ‘హిండెన్ బర్గ్’ భారత్ లో ఉంటే అదానీ గ్రూప్ కంపెనీల గురించి నివేదికను జారీ చేసినందుకు చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారన) చట్టం ‘UAPA’ ను ఎదుర్కొనేది” అని అంటూ సెటైర్ వేశారు. కాగా గౌతమ్ అదానీ ప్రధాని మోడీకి చాలా సన్నిహితుడని అందుకే దేశంలోనేకాకుండా విదేశాల్లో కూడా అదానీకి మోడీ ఎన్నో ప్రాజెక్టులకు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలు అవే ఆరోపణలు చేస్తున్నాయి. అందుకే అదానీ గ్రూప్ కంపెనీల గుట్టు బయటపెట్టిన ‘హిండెన్ బర్గ్’ భారత్ లో ఉంటే చట్టవిరుద్ధ చర్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చేదంటూ మోడీ ఆ విధమైన చర్యల్ని చేపట్టేవారు అన్నట్లుగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఒవైసీ.

కాగా ఈ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్ని అదానీ షేర్ల పతనం అంశం కుదిపేస్తోంది. అదానీ షేర్ల పతనం గురించి..”హిండెన్‌బర్గ్’’ నివేదిక గురించి సభల్లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ మోడీ సర్కార్ మాత్రం విపక్షాల డిమాండ్ ను ఏమాత్రం పట్టించుకోవటంలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పార్టీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చినా ఏమాత్రం స్పందన లేదు.

ఈక్రమంలో బుధవారం (ఫిబ్రవరి 8,2023) పార్లమెంట్ లో ఒవైసీ మాట్లాడుతూ..”హిండెన్‌బర్గ్’’ భారతదేశంలో ఉంటే..చట్టవిరుద్ధ చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని అంటూ బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. అదానీతో మోడీకున్న సంబంధాల గురించి ఒవైసీ ప్రస్తావించారు. అదానీ షేర్లు అంతకంతకు దిగజారిపోతుంటే మోడీ పైకి కనిపించకుండా బాధపడుతున్నారంటూ సెటైర్లు వేశారు.

అంతేకాదు ముస్లింలకు అంత్యం పవిత్రమైనది ‘ఆకుపచ్చ’రంగు అని ప్రధాని మోడీకి ఆకుపచ్చ రంగు అంటే ఎందుకంత అసహనం?అని ప్రశ్నించారు. మాకు ఆకుపచ్చ రంగు అంటే పవిత్రమైనది. అందుకని ప్రధాని మోడీ త్రివర్ణ పతాకం (జాతీయ జెండా)లోని ఆకుపచ్చ రంగు తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఆకుపచ్చ రంగుతో ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ప్రధాని మోదీ చైనా దురాక్రమణలపై మాట్లాడతారా? బిల్కిస్ బానోకి న్యాయం దక్కుతుందా? అని ప్రశ్నించారు. మీకు నారీ శక్తి గురించి నినాదాలు చేస్తారు కానీ బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు.

మైనార్టీ వర్గాలంటే ప్రధానికి చిన్నచూపు అని ఆరోపించిన ఒవైసీ 2023-24 బడ్జెట్ లో మైనార్టీ మంత్రిత్వశాఖకు 38 శాతం కేటాయింపులు తగ్గాయని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానికి మైనార్టీలు అంటే ఎంత చులకనభావమో అర్థమవుతోందన్నారు. కాగా.. అదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయడం ఆ తరువాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతున్న విషయం తెలిసిందే.