Sonali Phogat Murder Case : సోనాలి ఫోగట్‌ హత్య కేసులో పురోగతి..గోవా క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ అరెస్టు

టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు పురోగతి సాధించారు. గోవా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రెస్టారెంట్‌ కర్లీ యజమాని ఎడ్విన్‌ నునెస్‌, డ్రగ్‌ డీలర్‌ దత్త ప్రసాద్‌ గవోంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో వీరిని నిందితులుగా చేర్చారు. వారిపై డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు.

Sonali Phogat Murder Case : సోనాలి ఫోగట్‌ హత్య కేసులో పురోగతి..గోవా క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ అరెస్టు

Sonali Phogat murder case

Sonali Phogat Murder Case : టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు పురోగతి సాధించారు. గోవా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రెస్టారెంట్‌ కర్లీ యజమాని ఎడ్విన్‌ నునెస్‌, డ్రగ్‌ డీలర్‌ దత్త ప్రసాద్‌ గవోంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో వీరిని నిందితులుగా చేర్చారు. వారిపై డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు. సోనాలీ ఫోగట్ గుండెపోటుతో మరణించినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు… ఆ తర్వాత పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు.

సోనాలి ఫోగట్ సన్నిహితులు ఆమెకు విషపదార్ధాలను ఇచ్చారని, బలవతంగా కెమికల్స్ తాగించిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయినట్టు చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధిచిన కేసులో ఫోగట్ సన్నిహితులు సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి మూడు రోజుల క్రితమే అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ 10 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే వారిరువురు గోవాంకర్ అనే డీలర్ నుంచి తాము డ్రగ్స్ సేకరించినట్టు ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్టు తెలుస్తోంది.

Sonali Phogat Death Case: సోనాలి ఫోగట్ మృతి కేసు సీబీఐకి? గోవా సీఎం ఏమన్నారంటే..

మరోవైపు ఫోగట్ బస చేసిన రిసార్ట్‌లోని సిబ్బందితో సహా 25 మందిని ఇంతవరకూ పోలీసులు ఇంటరాగేట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన ఇన్వెస్టిగేషన్ అధికారులు సోనాలి ఫోగట్‌కు వాటర్ బాటిల్‌లో ఒక లిక్విడ్ కలిపి బలవంతంగా తాగించినట్టు గుర్తించారు. సోనాలి సోదరుడు రింకు ఢాకా సైతం ఆమె సన్నిహితులు ఇద్దరిపై ఆరోపణలు చేశారు. సోనాలి రాజకీయ కెరీర్‌ను నాశనం చేసి, ఆమె ఆస్తులు చేజిక్కుంచుకోవాలనే ఉద్దేశం వారికి ఉందని రింకు ఆరోపించారు.