Viral Video: చూస్తుండగానే నదిలో కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. వీడియో వైరల్

అస్సాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ నదిలో కుప్పకూలిపోయింది. బ్రహ్మపుత్ర నదికి వరదనీరు పోటెత్తింది. భారీ వరద కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అయితే నల్బరీ జిల్లాలో నదికి ఆనుకొని పోలీస్ స్టేషన్ భవనం ఉంది.

Viral Video: చూస్తుండగానే నదిలో కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. వీడియో వైరల్

Viral Video

Viral Video: అస్సాంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 24లక్షల మందికి పైగా ప్రజలు ఇప్పటికీ నిరాశ్రయులయ్యారు. క్యాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణం వంటి అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఒక వారం కంటే ఎక్కువ నీటిలోనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 139 మంది చనిపోయారు.

Viral News: రాత్రివేళ రోడ్డు భలే వేశారు.. ఉదయాన్నే బైక్ పరిస్థితి చూసి కంగుతిన్న స్థానికులు..

అస్సాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ నదిలో కుప్పకూలిపోయింది. బ్రహ్మపుత్ర నదికి వరదనీరు పోటెత్తింది. భారీ వరద కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అయితే నల్బరీ జిల్లాలో నదికి ఆనుకొని పోలీస్ స్టేషన్ భవనం ఉంది. నదిలో భారీ వరద కారణంగా రెండంతస్తుల భవనంలో సగభాగం నీటిలో మునిగిపోయింది. నది ఒడ్డుభాగం భారీకోతకు గురికావడంతో పోలీస్ స్టేషన్ భవనం స్థానికులు చూస్తుండగానే పేకమేడలా కూలిపోయింది. భవనం నదిలో కూలిపోతున్న దృశ్యాలను గ్రామస్తులు ఫోన్ లలో బంధించారు. వాటిని పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.

Disease X: ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు?.. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరించారంటే..
గత రెండు వారాలుగా వర్షాల కారణంగా అస్సాంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాసైతం పూర్తిగా నిలిచిపోయింది. వరదల్లోచిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది.