Power Saving : స్విచ్ ఆఫ్ కాదు..అన్‌ఫ్లగ్‌ అలవాటుచేసుకోండి..కరెంట్ బిల్ తగ్గించుకోండి

కరెంట్ బిల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే చిన్న చిన్న టిప్స్ తో పవర్ ఎలా సేవ్ చేయొచ్చు..అన్ ఫ్లగ్ చేయటం వల్ల ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకోండి..చిన్న పాటి నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకోండీ..

10TV Telugu News

Power Saving : వామ్మో..ఈ నెల కరెంట్ బిల్ ఏంటి షాక్ కొట్టేంత వచ్చింది? అని భయపడుతున్నారా? పెద్దగా వాడలేదే..అయిన ఇంత బిల్ వచ్చిందేంటీ? మిక్సీ, గ్రౌండర్, ఓవెన్ అన్నీ తక్కువగానే వాడుతున్నామే..అయినా ఇంత బిల్లా? అని ఆశ్చర్యపోతున్నారా? కరెంట్ ఎలా సేవ్ చేయాలి?బిల్ ఎమౌంట్ తక్కువ రావాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా?
అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. మనకు తెలియకుండానే కరెంట్‌ను అనవసరంగా ఖర్చు చేస్తున్నామని మీకు తెలుసా?.. అదీ ఆఫ్‌ చేసినా సరే. నిజమేనండీ..మొత్తం పవర్‌ బిల్లులలో మినిమమ్‌ 1 శాతం.. పవర్‌ ఆఫ్‌ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్‌షెల్ఫ్‌ ఓ కథనం ప్రచురించింది.

టీవీ చూశాక..చాలామంది రిమోట్‌ తో ఆఫ్‌ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు.లేదా పడుకుంటారు. స్విచ్ఛాఫ్‌ చేయకుండా రిమోట్ తో ఆఫ్ చేసిన అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా..అదే ప్రతీరోజు అలాగే జరిగితే లెక్క ఎక్కువుతుంది.ఫలితంగా కరెంట్ ఎక్కువగా ఖర్చు అవుతుంది.

సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ : చాలామంది సెల్ ఫోన్ ను ఎంతగా వాడతారో..చార్జింగ్ పెట్టేటప్పుడు అంత నిర్లక్ష్యం చేస్తారు.ఫోన్‌ ఛార్జింగ్‌ అయ్యాకో, మధ్యలో ఫోన్‌ కాల్‌ వస్తేనో స్విచ్ఛాఫ్‌ చేయకుండా ఫోన్‌ నుంచి పిన్‌ తీసేసి మట్లాడటంలో మునిగిపోతారు. పవర్‌ బటన్‌ను ఆఫ్‌ చేయాలనే ధ్యాసే ఉండదు. సాకెట్‌ నుంచి ఛార్జర్‌ను తీసేయడం అసలే చేయరు. అది అలాగే ఉంటుంది మళ్లీ ఫోన్ చార్జింగ్ పెట్టేంత వరకూ..ఆ తరువాత కూడా అదే పరిస్థితి. అలా ఛార్జర్‌ ప్లగ్ నుంచి తీయకపోతే..రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుందట. అంతేకాదు ఛార్జర్‌ పాడైపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుందనే విషయం గుర్తు తెలుసుకోవాలి.

వైఫై మోడెమ్ : స్విచ్ ఆఫ్‌ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండేది ఇదే. వైఫై మోడెమ్. ఇంటర్నెట్‌ను ఉపయోగించినా లేకపోయినా..వైఫై పరిధి నుంచి మొబైల్స్ గానీ ల్యాప్ టాప్ లుగానీ..దూరంగా వెళ్లినా సరే.. 24లు వైఫైలు ఆన్‌లోనే ఉంటుంది. దీని వల్ల ఎంత కరెంట్‌ ఖర్చు అవుతుందని చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడుగానీ లేదా బయటికి వెళ్లినప్పుడు లేదా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్‌ చేయటమే కాకుండా ఫ్లగులు తీసేయడం చాలా చాలా మంచిది.

మైక్రో ఓవెన్స్‌.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉన్నాగానీ ఉన్న ఇంటిలో వాడకం బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతీదానికి ఓవెన్ వాడటం బాగా పెరిగింది. అవసరానికి వాడుకోవచ్చు. కానీ వీటిని వాడిన తరువాత పూర్తిగా ఆఫ్‌ చేయకుండాతద వదిలేస్తుంటారు. లేదా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ మాత్రం అలాగే ఉంచేస్తారు. మైక్రో ఓవెన్స్‌, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయనే విషయం తెలుసా. కాబట్టి వాడనప్పుడు ఫ్లగ్‌ తీసేసి అవసరం అయినప్పుడు ప్లగ్ పెట్టుకుని అవసరం లేనప్పుడు తీసేయటం బెటర్.

అలాగే పెద్దసైజులో ఉండే వాషింగ్‌ మెషిన్స్‌, డ్రైయర్స్‌, మిక్సర్‌లు, గ్రైండర్‌లు, రైస్‌ కుక్కర్లు, టేబుల్‌ ఫ్యాన్‌లు, బ్లూటూత్‌ స్పీకర్‌లు ఆఫ్‌ చేయడం చాలా చాలా ముఖ్యం. అవసరం లేనప్పుడు అన్‌ఫ్లగ్‌ చేయడం చాలా మంచిది. వపవ్ సేవ్ కు ఎంతో అవసరం. ఇటీవల చాలామంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. దీంట్లో భాగంగా చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్‌ చేసినా అన్‌ఫ్లగ్‌ చేయకుండానే వదిలేస్తారు. పవర్‌సేవింగ్‌ ఒక అవసరమే కాదు.. ఒక బాధ్యత అనుకోవాలి. అలా చేస్తే కరెంట్‌ను ఆదా అవుతుంది. మనకు ఖర్చు తగ్గుతుంది. అలాగే అప్లయన్సెస్‌ను పాడవకుండా ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది. మరి ఇప్పటి నుండైనా అన్ ప్లగ్ చేయటం అలవాటు చేసుకోండి..ఖర్చు ఆదా చేసుకోండి.

10TV Telugu News