PM Kanya Ashirwad Yojana : కేంద్రం కొత్త పథకం..! పెళ్లి కానుకగా రూ.లక్షా 80వేలు.! అసలు నిజం ఇదే
కేంద్రం కొత్త స్కీమ్ తీసుకొచ్చిందట. అందులో భాగంగా నిరుపేదలకు లక్షా 80వేల రూపాయలను.. వివాహ కానుకగా అందిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIBFactCheck దృష్టికి వెళ్లింది. వాళ్లు వెంటనే స్పందించారు.

PM Kanya Ashirwad Yojana : సోషల్ మీడియా వచ్చాక ఎంత మేలు జరుగుతోందో అంతే కీడు కూడా జరుగుతోంది. నిజాలకంటే అబద్దాలే, తప్పుడు సమాచారమే ఎక్కువగా ప్రచారం అవుతోంది. జనాలను తప్పుదోవ పట్టించే అంశాలే ఎక్కువగా వస్తున్నాయి. ఏది నిజం? ఏది ఫేక్? అనేది తెలుసుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఫేక్ న్యూస్ లు ఎక్కువగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. నిజం తెలియని కొందరు అమాయకులు వాటి కారణంగా అడ్డంగా మోసపోతున్నారు. బ్యాంకు ఖాతాలోని డబ్బు పోగొట్టుకుంటున్నారు. గుడ్డిగా నమ్మి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
ఇప్పటికే పలు ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి మరో అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. కేంద్రం కొత్త స్కీమ్ తీసుకొచ్చిందట. అందులో భాగంగా నిరుపేదలకు లక్షా 80వేల రూపాయలను.. వివాహ కానుకగా అందిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIBFactCheck దృష్టికి వెళ్లింది. వాళ్లు వెంటనే స్పందించారు.
కేంద్రం నిరుపేదలకు వివాహ కానుక అందిస్తుంది అనే ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదంది. అది ఫేక్ అని చెప్పింది. ‘ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ స్కీమ్ కింద ఆడపిల్లలకు రూ.1.80లక్షల నగదు అందజేస్తోందని కొన్ని యూట్యూబ్ చానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేశాయంది. నిజానికి.. అసలు అలాంటి స్కీమే లేదని అధికారులు వెల్లడించారు. కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ప్రజలు మోసపోవద్దని సూచించింది.
Also Read..ChatGPT: చాట్‌జీపీటీ వాడుతున్నారా? అయితే.. ఈ విషయం తెలుసుకోండి! లేదంటే..
మరోవైపు ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు స్కీమ్ ల పేరుతో జనాల నుంచి డబ్బు కొట్టేసేందుకు సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉంటారు. కాబట్టి, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. అందులో నిజమెంతో కనుక్కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
‘Government Gyan’ नामक #YouTube चैनल की एक वीडियो में दावा किया गया है कि केंद्र सरकार ‘प्रधानमंत्री कन्या आशीर्वाद योजना’ के तहत सभी बेटियों को ₹1,80,000 की नगद राशि दे रही है#PIBFactCheck
✅ यह वीडियो #फ़र्ज़ी है।
✅ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/y8KRVfxVrF
— PIB Fact Check (@PIBFactCheck) March 11, 2023