Fake Message Scam : మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? జాగ్రత్త.. 3 రోజుల్లో 40మంది కస్టమర్ల అకౌంట్లు ఖాళీ.. ఈ లింక్ క్లిక్ చేస్తే ఖతమే..!
Fake Message Scam : సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త.. ఆన్‌లైన్ మోసాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మీ ఫోన్‌కు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? పొరపాటున కూడా ఆయా లింకులను క్లిక్ చేయొద్దు.

Fake Message Scam _ Around 40 bank customers lost lakhs in 3 days after falling for fake message, check details
Fake Message Scam : సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త.. ఆన్‌లైన్ మోసాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మీ ఫోన్‌కు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? పొరపాటున కూడా ఆయా లింకులను క్లిక్ చేయొద్దు. లేదంటే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్టే.. ఇటీవల చాలామంది బ్యాంకు కస్టమర్లకు ఇలా ఒక మెసేజ్ వస్తోంది. వాస్తవానికి ఇది ఫేక్ మెసేజ్ (Fake Message). ‘డియర్ కస్టమర్, ఈరోజు మీ బ్యాంక్ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. డీయాక్టివేషన్ కాకుండా ఉండాలంటే.. ఇప్పుడే మీ KYC/PANని అప్‌డేట్ చేయండి.
అప్‌డేట్ చేసేందుకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి’ అని ఉంటుంది. మీరు కూడా ఇటీవల ఇలాంటి SMS అందుకున్నారా? అవును. అయితే SMSను రిపోర్టు చేయండి. అంతేకానీ, ఆ లింక్‌పై Click చేయవద్దు. ఇలాంటి ఫిషింగ్ స్కామ్‌లు (Phishing Scams) కొత్తవి కానప్పటికీ.. వైరల్ బ్యాంక్ ఫిషింగ్ SMSల బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. చాలా మంది బ్యాంక్ కస్టమర్‌లు ఈ SMSలను ఫ్లాగ్ చేసి రిపోర్టు చేశారు. అందుకే వినియోగదారుల్లో అవగాహన పెరగాల్సి ఉంది. ఎంతగా అవగాహన, జాగ్రత్తలు సూచించినప్పటికీ ఎవరో ఒకరు ఈ స్కామర్ల మోసగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. ముంబైలో స్కామర్లచే ఇటీవల సుమారు 40 మంది బ్యాంకు కస్టమర్లు లక్షల రూపాయలను పొగొట్టుకున్నారు.
ముంబైలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన 40 మంది బ్యాంక్ కస్టమర్లు ఫేక్ బ్యాంక్ SMS ద్వారా పంపిన లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత కేవలం 3 రోజుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని ఇటీవలి ఓ నివేదిక వెల్లడించింది. బాధిత కస్టమర్లకు తమ KYC PANని అప్‌డేట్ చేయమని SMS అలర్ట్ వచ్చింది. లేదంటే బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఉంది. బ్యాంకు అధికారిక నోటిఫికేషన్ అని భావించిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఆయా లింకులను క్లిక్ చేసి లక్షల్లో డబ్బును పోగొట్టుకున్నారు.

Fake Message Scam _ Around 40 bank customers lost lakhs in 3 days
ఈ ఫిషింగ్ బ్యాంక్ SMS మోసానికి గురైన 40 మంది బ్యాంక్ కస్టమర్‌లలో ఒకరు ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత రూ. 50వేల కన్నా ఎక్కువ నష్టపోయారు. KYC, PAN వివరాలను అప్‌డేట్ చేయమని కోరుతూ తనకు SMS వచ్చిందని మెమన్ తన ఫిర్యాదులో పేర్కొంది. తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని భావించి తన బ్యాంక్ నుంచి వచ్చిన ఫేక్ SMS లింక్ క్లిక్ చేసింది.
అంతే.. ఆ లింక్ నుంచి మరో వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయింది. అప్పుడు అక్కడ వెబ్ పేజీలో Customer ID, పాస్‌వర్డ్‌లు, OTPని ఎంటర్ చేయమని అడగడంతో అలానే చేసింది. SMS వచ్చిన తర్వాత ఒక మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయమని కోరింది. అలానే బాధిత కస్టమర్ OTPని షేర్ చేసింది. అంతే.. కొద్ది నిమిషాల్లోనే ఆమె బ్యాంకు అకౌంట్ నుంచి రూ.57,636 డెబిట్ అయింది.
వెంటనే మోసాన్ని గుర్తించిన బాధిత మహిళ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బ్యాంకు కస్టమర్లను అలర్ట్ చేశారు. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల లింక్‌లపై క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేశారు. సైబర్ మోసాలపై ప్రజల్లో చాలామందికి అవగాహన ఉన్నప్పటికీ స్కామర్‌లు ఎలా మోసగించగలరో హెచ్చరిస్తున్నారు. ఫిషింగ్ SMSల ద్వారా స్కామర్లు కస్టమర్లను నమ్మిస్తారని, ఇలాంటి మెసేజ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also : Moto G73 5G Launch India : మార్చి 10న మోటో G73 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!