వెరైటీ టీచింగ్ : డ్యాన్స్ తో టీచర్ పాఠాలు 

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 04:18 AM IST
వెరైటీ టీచింగ్ : డ్యాన్స్ తో టీచర్ పాఠాలు 

ఆటలు, పాటలు, నాట్యం మనస్సుకు ఉల్లాసాన్ని..ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆటలంటే చిన్నతనమే గుర్తుకొస్తుంది. కానీ ఈనాటి పిల్లలకు ఆట అంటే వీడియో గేములే. ఆరుబైట ఆటలు లేవు..స్కూల్లో ఆటలు లేవు.దీంతో పుస్తల చదువులు తప్పవారికి ఇంకేమీ తెలీదు. అస్సలు ప్లే గ్రౌండ్ ఉన్న  స్కూల్సే ఉండటంలేదు. కానీ మనస్సుంటే మార్గం ఉండకపోదు..స్కూల్లో ప్లే గ్రౌండ్ లేకపోయినా పిల్లలతో ఆటలు ఆడిస్తే వారికి చదువు కూడా చాలా త్వరగా వస్తుంది.దీన్ని అక్షరాల అమలు చేస్తున్నారు ఓ హెడ్ మాస్టర్.

స్కూల్ కు హెడ్ మాస్టర్ అంటే స్కూల్ నిర్వహణతోపాటు తోటు అన్నీ తానై విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు..విద్యార్ధులతో డ్యాన్స్ లు చేయిస్తు..పాటలు పాడిస్తు చదువులు చెబుతున్నారు. దీంతో పిల్లలు కూడా ఏదో మొక్కుబడిగా చదువుకోవటం కాకుండా చాలా ఉత్సాహంగా చదువుకుంటున్నారు. ఆ డ్యాన్స్ టీచర్ విశేషాలు తెలుసుకుందాం..

ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని లామ్‌టాపుట్ లోని గవర్నమెంట్ స్కూల్లో ప్రఫుల్ల కుమార్ పాటి హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. హెడ్ మాస్టర్ అయినా..విద్యార్ధులకు చాలా చేరువగా ఉంటారు. వారికి మంచి చెడ్డలు చెబుతుంటారు. చదువు ఎంత ముఖ్యమో వివరిస్తుంటారు. అంతేకాదు ఆయన చెప్పే పాఠాలంటే విద్యార్ధులకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే డ్యాన్స్ లతో పాఠాలు చెప్పే ప్రఫుల్ల కుమార్ అంటే చాలా ఇష్టపడతారు. ఈ డ్యాన్స్ పాఠాల గురించి ప్రఫఉల్ల కుమార్ మాట్లాడుతూ..డ్యాన్స్ తో పాఠాలు చెబుతుండటంతో పిల్లు పాఠాల్ని ఎంతో శ్రద్ధాసక్తులతో వింటున్నారనీ..స్కూల్లో విద్యార్ధుల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. 

ప్రఫుల్ల కుమార్ డ్యాన్స్ పాఠాల వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.  ఈ పాఠాలతో ఈయన  ‘ఒడిశా డ్యాన్స్ టీచర్’ గా పేరొందారు. క్లాస్ నేర్పించేటప్పుడు విద్యార్థులతో పాటు పాటలు పాడుతూ..డ్యాన్స్ చేయడం..ఎక్స్ ర్ సైజులు చేయిస్తూ పాఠాలను అతి సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా..చెబుతున్నారు. 

హెడ్ మాస్టర్ పాఠాలు చెబుతుంటే విద్యార్థులంతా మరింత ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. అంతేకాదు రోజు ఒకే విధమైన ఆటపాటలు..డ్యాన్స్ కాకుండా..ప్రతిరోజూ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక డ్యాన్స్ క్లాస్ ఉంటుందని ప్రఫుల్ల కుమార్ తెలిపారు. దీంతో విద్యార్థులంతా చురుకు ఉంటున్నారనీ..ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారనీ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మధ్యాహ్నం భోజనం అనంతరం డ్యాన్స్ ..పాటలు క్లాస్ ఉంటడటంతో వారు క్లాస్ లో నిద్రపోకుండా ఉత్సాహంగా ఉంటున్నారనీ తెలిపారు.

కాగా..కొరాపుట్ ప్రాంతంలో ఉండేవారిలో ఎక్కువగా  గిరిజనులే ఉంటారనీ..స్కూల్ కు వచ్చే విద్యార్థులు చాలామంది గిరిజనుల బిడ్డలేనన్నారు. సాధారణంగా వారు స్కూల్ కు రావటానికి గతంలో ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఈ డ్యాన్స్ క్లాస్ లతో విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూల్ కు వస్తున్నారనీ తెలిపారు. డ్రాప్-అవుట్ సంఖ్య బాగా  తగ్గిందనే విషయాన్ని తాము గుర్తించామన్నారు స్కూల్ హెడ్ మాస్టర్ ప్రఫుల్ల కుమార్. అంతేకదా..ఏదో ర్యాంకుల కోసం..స్కూల్ బ్రాండ్ ల కోసం విద్యార్థులకు బట్టీ కొట్టే చదువులే తప్ప ఉల్లాసంతో కూడిన చదువులలు కనిపించటంలేదు. దీంతో పిల్లలు చదువుల విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనీ..మానసకి నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ ప్రతీ స్కూల్ కు ప్రఫుల్ల కుమార్ వంటి టీచర్స్ ఉంటే విద్యార్థులంతా చదువల తల్లి సరస్వతీ బిడ్డలుగా మారిపోతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.