Prakash Raj: చంద్రయాన్-3ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?
చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Prakash Raj
Prakash Raj- Chandrayaan 3: ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan 3) చంద్రుడిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో చంద్రుడు (Moon) దక్షిణ ధ్రువం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander ) అడుగు పెట్టనుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయితే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈనెల 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడుతుందని ఇస్రో తెలిపింది. రష్యా లూనా-25 ప్రయోగం విఫలం కావడంతో.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3వైపు చూస్తున్నాయి. దేశం మొత్తం చంద్రయాన్-3 గురించి మట్లాడుకుంటుంది. ఈక్రమంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrayaan-3 : చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు ముందు ఇస్రో విడుదల చేసిన చంద్రుడి తాజా చిత్రాలు
ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఫొటోలో.. ఓ వ్యక్తి లుంగీలో టీ పోస్తున్నట్లు ఉంది. అది కార్టూన్ రూపంలో ఉంది. ఈ ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ ఇలా రాశారు..‘బ్రేకింగ్ న్యూస్.. చంద్రుని నుండి వస్తున్న మొదటి చిత్రం #VikramLander వావ్’ అంటూ రాశారు. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఫొటో చాయ్ వాలాను పోలిఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రకాశ్ రాజ్ పోస్టు ఉండటంతో మండిపడుతున్నారు.
చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ల ఇలా రాశారు.. ప్రకాశ్ రాజ్.. చంద్రయాన్ మిషన్ ఇస్రో ప్రయోగించింది.. బీజేపీది కాదు. మీరు విమర్శించాలనుకుంటే ఇండియాను కాదు.. ఏదైనా పార్టీని విమర్శించుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై బీజేపీ నేతలుసైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
BREAKING NEWS:-
First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G— Prakash Raj (@prakashraaj) August 20, 2023