కాంగ్రెస్‌కు హఠావో మోడీ పిలుపు

కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు.

  • Edited By: madhu , April 12, 2019 / 07:24 AM IST
కాంగ్రెస్‌కు హఠావో మోడీ పిలుపు

కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు.

కాంగ్రెస్ హఠావో..అంటూ భారత ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం మహారాష్ట్రకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు, ఆరోపణల బాణాలు సంధించారు.

తుగ్లక్ రోడ్‌‌లో ఉన్న పెద్ద భవంతిలోఓ నేత నివాసం ఉంటారని..అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి భారీగా డబ్బుల సంచులున్నాయని పరోక్షంగా కాంగ్రెస్‌ని ఉద్దేశించి కామెంట్ చేశారు మోడీ. అవన్నీ పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులని..ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు వెదజల్లుతోందన్నారు మోడీ. 
Read Also : జగన్‌కి వేల కోట్లు ఎవరిచ్చారు : కేసీఆర్‌కి ఏపీలో ఏం పని

కాంగ్రెస్ పరిపాలనలో దేశం అభివృ‌ద్ధి సాధించదని తెలిపిన మోడీ కాంగ్రెస్ ప్రారదోలితే స్కాం..కుంభకోణాల నుండి దేశం విముక్తి అవుతుందన్నారు. మహారాష్ట్రతో పాటు దేశాన్ని దోచుకొంటోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న విధానాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెపాలని మోడీ పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్, ఎన్సీపీ పాలనలో ఎన్నో బాంబు దాడులు జరిగినట్లు.. ఆయా ఘటనలలో రైతులు, వ్యాపారులు, పేద తరగతికి చెందిన వారు చనిపోయారన్నారు. ఐదేళ్ల కాలంలో బాంబు దాడులు జరిగాయా ? అని ప్రశ్నించారు. అవినీతి పరులు పాతాళలోకంలో ఉన్నా పట్టుకుంటానన్న మోడీ…పాకిస్తాన్ విషయంలో గతంలో ఉన్న పాలకులు..ఇప్పుడున్న పాలకులు ఏ విధంగా వ్యవహరించారో గమనించాలన్నారు.  
Read Also : చంద్రబాబు ఆగ్రహం : అందరూ కలిసి టీడీపీపై కుట్రలు, ఏపీని బీహార్ చేస్తారా!