PSLV-C54: మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో.. ఈ నెల 26న పీఎస్ఎల్వీ-సీ54 ప్రయోగం

ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26న ‘పీఎస్ఎల్వీ-సీ 54’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఓషన్‌శాట్-3ఏ ఉపగ్రహంతోపాటు, మరో 8 నానో శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది.

PSLV-C54: మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో.. ఈ నెల 26న పీఎస్ఎల్వీ-సీ54 ప్రయోగం

PSLV-C54: ఇటీవలే ప్రైవేటు రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26న ‘పీఎస్ఎల్వీ-సీ 54’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఓషన్‌శాట్-3ఏ ఉపగ్రహంతోపాటు, మరో 8 నానో శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతుంది.

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

భారత కాలమానం ప్రకారం నవంబర్ 26, ఉదయం 11.56 నిమిషాలకు ఈ ప్రయోగం చేపడుతారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాల్ని ఇస్రో అధికారులు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. ‘పీఎస్ఎల్వీ-సీ 54’ లేదా ‘ఈఓఎస్-06’ అనే ఈ మిషన్ ద్వారా 9 ఉపగ్రహాల్ని ప్రయోగిస్తారు. ఈఓఎస్ అంటే భూమిపై పరిశోధనలకు సంబంధించిన శాటిలైట్. దీని ద్వారా ‘ఓషన్‌శాట్-3ఏ ఉపగ్రహాన్ని, అలాగే భూటాన్ తరఫున పిక్సెల్ ఇండియా అభివృద్ధి చేసిన ఆనంద్ అనే శాటిలైట్‌, ధృవ స్పేస్ సంస్థ తయారు చేసిన నానో శాటిలైట్‌లు, అమెరికాకు చెందిన సంస్థ తయారు చేసిన శాటిలైట్‌లతో కలిపి మొత్తం ఎనిమిది నానో శాటిలైట్‌లన ప్రయోగిస్తారు.

ఈ శాటిలైట్‌ల ద్వారా భారత తీర ప్రాంతాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థను పరిశీలిస్తారు. వీటిని ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు. ఇది ఇస్రో చేపడుతున్న 84వ ప్రాజెక్టు. అలాగే ఈ ఏడాది చేపడుతున్న ఐదో మిషన్.