Punjab Politics : పంజాబ్ లో కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్..సిద్ధూకి సంఘీభావంగా మంత్రి రాజీనామా

పంజాబ్​ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే

Punjab Politics : పంజాబ్ లో కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్..సిద్ధూకి సంఘీభావంగా మంత్రి రాజీనామా

Punjab (2)

Punjab Politics పంజాబ్​ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధూకి సంఘీభావంగా మంత్రి పదవికి రజియా సుల్తానా రాజీనామా చేసింది. ఓ కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని రజియా సుల్తానా సృష్టం చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపింది.

రెండు రోజుల క్రితమే రజియా సుల్తానా పంజాబ్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే సిద్ధూకి సంఘీభావంగా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆమె సోనియాకి పంపిన లేఖలో ప్రకటించారు. ఓ కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని రజియా సుల్తానా సృష్టం చేశారు. అన్ని వేళలా తనను,తన కుటుంబాన్ని ఆశీర్వదించిన సోనియా,రాహుల్ గాంధీ కి ధన్యవదాలు చెబుతున్నానన్నారు.

కాగా, పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీ పడడం ఇష్టంలేకే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసినట్లు సోనియాగాంధీకి మంగళవారం రాసిన లేఖలో సిద్ధూ తెలిపిన విషయం తెలిసిందే. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని లేఖలో తెలిపిన సిద్ధూ.. పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ ఏడాది జులైలో పంజాబ్​ కాంగ్రెస్​ బాధ్యతలు చేపట్టిన సిద్ధూ.. రెండు నెలల్లోనే పదవికి దూరమయ్యారు.

సిద్ధూ రాజీనామాపై ఆమ్​ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ఒక దళితుడు(చరణ్ సింగ్​ చన్నీ) సీఎం కావడం జీర్ణించుకోలేకే సిద్ధూ తన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపించింది.

ALSO READ  స్థిరమైన వ్యక్తి కాదని ముందే చెప్పా కదా..సిద్ధూ రాజీనామాపై కెప్టెన్