Punjab elections: కాంగ్రెస్ థీమ్ సాంగ్‌.. సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి! సీఎంపై అభ్యర్థిపై క్లారిటీ?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు వారాల ముందు, కాంగ్రెస్ పార్టీ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది.

Punjab elections: కాంగ్రెస్ థీమ్ సాంగ్‌.. సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి! సీఎంపై అభ్యర్థిపై క్లారిటీ?

Congress Song

Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు వారాల ముందు, కాంగ్రెస్ పార్టీ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ద్వారా పంజాబ్ ప్రజలకు రెండో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‌ థీమ్‌ సాంగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులైన రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో కొత్త పాఠశాలల నిర్మాణం, విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు వంటి వాటిని వివరించింది.

పంజాబీ భాషలో రాసిన ఈ 2నిమిషాల 20సెకన్ల పాటలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా ఇతర నాయకులు కనిపిస్తున్నారు. పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పాటను షేర్ చేసింది.

కాంగ్రెస్‌ థీమ్‌ సాంగ్‌లో సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే మెయిన్‌గా కనిపిస్తున్నారు. అయితే, ఈ పాటలో చాలా చోట్ల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడా కనిపించారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బజ్వాకి కూడా సాంగ్‌‍లో చోటు దక్కింది.

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 6న రాహుల్ గాంధీ చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి సీఎం రేసులో వెనుకబడ్డాడు.

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు తీవ్రంగా ఉండగా.. పార్టీ గెలుపుపై ఈ కుమ్ములాటల ప్రభావం పడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో 117 మంది సభ్యులు అసెంబ్లీలో ఉండగా.. ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగబోతున్నాయి.