Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్

ట్రైన్ టాయిలెట్ లో ఉంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. డాగ్ స్వాడ్ తో స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసు డాగ్ టాయిలెట్ లో ఉన్న గంజాయి బ్యాగును పసిగట్టి పట్టించింది.

Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్

Railway Protection Force Seized Ganja

Railway protection force seized ganja : పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా..తనిఖీలు ముమ్మరం చేస్తున్నా గంజాయి స్మగ్లర్లు మాత్రం అక్రమ రవాణా కొనసాగిస్తునే ఉన్నారు. కొత్త కొత్త మార్గాల్లో అక్రమ తరలింపులు మాత్రం ఆగటంలేదు. రోడ్డు మార్గం ద్వారా అయితే పోలీసుల నిఘా ఉంటుందని ఏకంగా ట్రైన్ లోనుంచి తరలింపులు చేస్తున్నారు. ఓ ట్రైన్ లో గంజాయి తరలిస్తున్న క్రమంలో ట్రైన్ టాయిలెట్ లో ఉన్న గంజాయి ప్యాకెట్లను పోలీస్ డాగ్ పసిగట్టింది. పోలీసులకు పట్టించింది.

గంజాయి స్మగ్లర్లు రైలు మార్గాలపై ఫోకస్ పెట్టారు. అన్ని ట్రైన్స్‌లో చెకింగ్స్ చేయటం కష్టం కాబట్టి.. ట్రైన్ లో నే తరలిస్తే సేఫ్ అని భావించారో ఏమోగానీ ఏకంగా ట్రైన్ లో తరలింపులు కొనసాగిస్తున్నారు. అయినా పోలీసులు కూడా ఆ దిశగా కూడా యోచిస్తూ ఈ మధ్య ట్రైన్స్‌లో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించి చాలామంది పట్టుకున్నారు. దీంతో ఈ అక్రమ రవాణాకు ఎలాగైనా చెక్ పెట్టాలని ఫిక్సయిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించింది. డ్రగ్స్ సహా ఇతర మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు వాటికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో కేటుగాళ్లను పట్టుకోవడం ఈజీగా అయ్యింది.

దీని కోసం RPF స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే జూలై 1న బదర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్ బృందం రైలు నంబర్ 15663లో తనిఖీ చేస్తున్నప్పుడు.. ఓ కుక్క ఓ కోచ్‌లోని వాష్ రూమ్‌వైపు పరుగులు తీసింది. ఆ టాయిలెట్‌లో అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించింది RPF టీమ్. బ్యాగ్‌ని తెరిచి చూడగా..టాయిలెట్ లో సుమారు రూ. 1.55 లక్షల విలువైన 15.5 కిలోలు, రూ. 2.4 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా జూన్ 30 నుంచి జూలై1 వరకు డాగ్ స్క్వాడ్‌ సాయంతో చేసిన తనిఖీల్లో వివిధ ఘటనల్లో రూ. 1.55 లక్షల విలువైన 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు RPF టీమ్ తెలిపింది.