అంతరించిపోలేదు : 50ఏళ్లకు కనిపించిన పాటలు పాడే కుక్క

  • Published By: nagamani ,Published On : September 3, 2020 / 10:11 AM IST
అంతరించిపోలేదు : 50ఏళ్లకు కనిపించిన పాటలు పాడే కుక్క

ఇప్పటికే ఎన్నో రకాల జంతువులు..జలచరాలు..ప్రాణులు అంతరించిపోయాయి. కానీ అలా అంతరించిపోయాయని అనుకున్నవి తిరిగి కనిపిస్తే..పర్యావరణవేత్తలకు..జంతు ప్రేమికులకు..శాస్త్రవేత్తలకు ఎంత ఆనందమో. అంతరించిపోయిందనుకున్న ‘పాటలు పాడే కుక్క’ 50 సంవత్సరాల తరువాత కనిపించి శాస్త్రవేత్తలకు ఆనందాన్నిచ్చింది.



Very rear singing dog

రామచిలకలు మాట్లాడుతాయి..పాటలు కూడా పాడుతాయనే సంగతి తెలిసిందే. కానీ కుక్కలు కూడా పాటలు పాడతాయా? అనే సందేహం కలుగుతుంది. న్యూ గినియాలో ఓ జాతి కుక్కలు పాటలు పాడుతాయి…అంటే రామచిలుకలంత ముద్దుగా పాడకపోయినా.. ఓజాతికి చెందిన కుక్కలు అరుస్తుంటే పాటలాంటి ధ్వని వస్తుంది. ఆ కుక్కలు గత కొన్ని సంవత్సరాలుగా కనిపించకపోయేసరికి అవికూడా అంతరించిపోయాయి అనుకున్నారు.



చాలా తక్కువ సంఖ్యలో ఉండే ఈ పాటలు పాడే జాతి కుక్కలను జూలో ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. 1970 కొన్ని కుక్కల్ని అధికారులు పట్టుకుని జూకు తరలించి సంరక్షించటంతో అవి జూలో 200 మాత్రమే ఉండేవి. ఇటీవల ఇండోనేషియాలోని పాపువా ప్రాంతపు అడవుల్లో ఓ పాటలు పడే కుక్క కనిపించేసరికి శాస్త్రవేత్తల ఆనందానికి వ్యక్తంచేశారు.
https://10tv.in/daughter-of-senior-railway-official-shoots-mother-teenage-brother/

అటవీ ప్రాంతాల్లో ఇవి పూర్తిగా అంతరించిపోయాయని అనుకున్నారు. వీటి జన్యు క్రమాన్ని సేకరించిన శాస్త్రవేత్తలు జూలోని కుక్కలతో పోల్చి సింగింగ్ డాగ్స్ పూర్తిగా అంతరించిపోలేదని గుర్తించారు. ఈ కుక్కలు చేసే ప్రత్యేక శబ్దాల కారణంగా వీటికి సింగింగ్ డాగ్స్ అనే పేరు వచ్చింది.



వాటిని చాలా సంవత్సరాల క్రితం యునైటెడ్ స్టేట్స్ కు ఎనిమిది కుక్కలను తీసుకువచ్చారు. కాగా..ప్రస్తుతం కనిపించిన ఈ కుక్కల గానం వింటుంటే చాలాకాలం క్రితం యునైటెడ్ స్టేట్స్ కు తీసుకు వచ్చిన కుక్కలకు చాలా సంబంధం కలిగి ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మరియు సీనియర్ యొక్క విశిష్ట పరిశోధకుడైన ఎలైన్ ఓస్ట్రాండర్ తెలిపారు.



న్యూ గినియా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపం. తూర్పు సగం పాపువా న్యూ గినియా, పశ్చిమ భాగం ఇండోనేషియాలో భాగం మరియు దీనిని పాపువా అని పిలుస్తారు. న్యూ గినియా హైలాండ్ అడవి కుక్క ఆవాసాలు కోల్పోవడం…ఫెరల్ గ్రామ కుక్కలతో కలవడం ద్వారా ఆ పాటలు పాడే కుక్కలు అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. కానీ పాపువాలోని గ్రాస్‌బర్గ్ బంగారు మరియు రాగి గని సమీపంలో కుక్కలను తిరిగి కనుగొన్నారు.