భారత్ బిన్ లాడెన్ మృతికి కారణం ఏంటి?

భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 03:50 PM IST
భారత్ బిన్ లాడెన్ మృతికి కారణం ఏంటి?

భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం అలాంటిదేమీ లేదని తేలింది. అటవీశాఖ అధికారులు కూడా ఇదే చెబుతున్నారు.

బీభత్సం సృష్టించి ఐదుగురిని చంపిన ‘బిన్ లాడెన్’ను ఏనుగును కొద్ది రోజుల క్రితమే అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఏనుగు ఆదివారం(నవంబర్ 17,2019) ఉదయం మృతి చెందింది. మొదటి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బంధించిన తర్వాత ఏనుగు మృతి చెందడం అనుమానాలకు దారితీసింది. నవంబర్ 11న అసోంలోని గోల్పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ మదపుటేనుగుకు అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బంధించారు. అటవీ ప్రాంతంలో నివాసముంటున్న ఐదుగురు గ్రామస్తులను ఒకే రోజు ఈ ఏనుగు చంపడంతో అటవీశాఖ అధికారులు బంధించారు.

బంధించిన కొన్ని గంటల్లోనే ఏనుగు మృతి చెండదం వివాదాస్పదమైంది. ఏనుగు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అసోం ప్రభుత్వం అధికారులను నియమించింది. పోస్టుమార్టం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సాధారణంగా 6నుంచి 7ఏళ్ల వయస్సుగల ఏనుగుల్ని మాత్రమే బోనులో బంధిస్తారు. అయితే, 35ఏళ్ల వయసున్న బిన్ లాడెన్‌ ను అధికారులు బోనులో పెట్టడంపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడ్డారు.

గోల్పారా జిల్లాలోని అడవుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది ఏనుగు. అక్టోబర్ లో 24 గంటల్లోనే ఐదుగురు గ్రామస్తులను చంపింది. దీంతో అమెరికాను వణికించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పేరుని ఈ ఏనుగుకి పెట్టారు స్థానికులు.