గ్యాంగ్ స్టర్ టు ఫుట్ బాల్ టీమ్ ఓనర్ : సక్సెస్ స్టోరీ ఆఫ్ రంజిత్ బజాజ్

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు సుఖాలు వస్తాయి. అన్నింటిని ఫేస్ చేయాల్సిందే. ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే అంతగా రాటుదేలుతాం.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 07:43 AM IST
గ్యాంగ్ స్టర్ టు ఫుట్ బాల్ టీమ్ ఓనర్ : సక్సెస్ స్టోరీ ఆఫ్ రంజిత్ బజాజ్

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు సుఖాలు వస్తాయి. అన్నింటిని ఫేస్ చేయాల్సిందే. ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే అంతగా రాటుదేలుతాం.

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు కష్టాలు, కొన్ని రోజులు సుఖాలు వస్తాయి. అన్నింటిని ఫేస్ చేయాల్సిందే. ఎన్ని కష్టాలను ఎదుర్కొంటే అంతగా రాటుదేలుతాం. చాలామంది విజేతల జీవితాల్లో ఇది నిజమైంది. కష్టాలను ధీటుగా ఎదుర్కొని సక్సెస్ అయిన వారు ఎందరో. ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే ఇదంతా ఒక్క రాత్రిలో అవ్వలేదు. ఎంతో శ్రమించారు.  తమ టాలెంట్ తో పట్టుదలతో డెడికేషన్ తో విజయతీరాలు చేరారు. వాళ్ల జీవితాలు అందరికి ఆదర్శం. యువతకు పాఠాలు నేర్పుతాయి. రంజిత్ బజాజ్.. కూడా అలాంటి జాబితాలోకే వస్తారు. ఆయన జీవితం అందుకు నిదర్శనం. రంజిత్ బజాజ్.. గ్యాంగ్ స్టర్ నుంచి ఫుట్ బాల్ టీమ్ ఓనర్ గా ఎదిగిన వైనం అందరికి ఆదర్శం.

గ్యాంగ్ స్టర్ రంజిత్ బజాజ్.. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు..ఓ ఫుట్ బాల్ టీమ్ ఓనర్. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఫుట్ బాల్ టీమ్ ఓనర్ గా తనకంటూ ఓ ప్రత్యేకత పొందిన సెలబ్రిటీ. మినర్వా పంజాబ్ ఫుట్ బాల్ క్లబ్ ఓనర్. (మినర్వా పంజాబ్ ఎఫ్ సీ పేరుని పంజాబ్ ఎఫ్ సీ మార్చారు) జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఈ టీమ్ ఉంది. వరుస విజయాలతో పంజాబ్ ఎఫ్ సీ దూసుకెళ్తోంది. 

ఒక్క రోజులోనే రంజిత్ బజాజ్ కి ఈ పేరు, ప్రఖ్యాతలు రాలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలు ఎదుర్కొన్నారు. క్రిమినల్ అనే ముద్రను వేయించుకున్నారు. జైలు జీవితం గడిపారు. కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ కుంగిపోలేదు. అన్నింటిని ధైర్యంగా ఫేస్ చేశారు. జైల్లో పాఠాలు నేర్చుకున్నారు. జీవితంలో ఎదగాలనే పట్టుదలని సంపాదించుకున్నారు. ఆ కసితోనే ఇవాళ ఓ ఫుట్ బాల్ టీమ్ ఓనర్ అయ్యారు.

అది 2010. అప్పుడు రంజిత్ బజాబ్ వయసు 32 ఏళ్లు. పంచకులలోని హోటల్ నార్త్ పార్క్ నుంచి బయటకు వచ్చారు. తన భార్య, బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్నారు. ఆ రాత్రి సమయంలో కొందరు యువకులు అడ్డుతగిలారు. రంజిత్ భార్య, స్నేహితురాలిని అవమానించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే.. రంజిత్ బజాబ్ కి కోపం వచ్చింది. ఆ గుంపులోని ఒక యువకుడిపై చేయి చేసుకున్నాడు. అతడికి బుద్ధి చెప్పాడు. కట్ చేస్తే.. రంజిత్ జైల్లో ఉన్నాడు.

రంజిత్ చేతిలో దెబ్బలు తిన్న యువకుడు సాధారణ వ్యక్తి కాదు. పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జి కొడుకు. ఇంకేముందు.. జడ్జి నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రంజిత్ పై తప్పుడు కేసులు పెట్టారు. మర్డర్ అటెంప్ట్ కేసు బుక్ చేశారు. రంజిత్ ని అరెస్ట్ చేసి అంబాలా జైలుకి తరలించారు.

ఆ జైల్లో 65 రోజులు ఉన్నాడు రంజిత్. ఆ జైలు అనుభవమే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. జీవితంలో సాధించాలనే కసి నింపింది. తాను ఏ తప్పు చేయకున్నా శిక్ష పడిందని రంజీత్ చాలా బాధపడ్డారు. అయింది ఏదో అయ్యింది.. ఇక నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ కేసు వీగిపోయింది. పోలీసులు రంజిత్ ని జైలు నుంచి రిలీజ్ చేశారు. బయటకు వచ్చిన రంజిత్ మరింత కసిగా పని ప్రారంభించారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించారు.

రంజిత్ బజాజ్ జీవితం గురించి చెప్పుకోవాలంటే.. అంబాలా సెంట్రల్ జైలు జీవితానికి ముందు తర్వాత అని చెప్పుకోవాలి. ఎన్నో పనులు చేశారు. అనేక రంగాల్లోకి వెళ్లారు.
* విద్యార్థి నేత
* రాష్ట్ర స్థాయి గోల్ కీపర్
* నైట్ క్లబ్ లో గోల్ కీపర్
* స్పోర్ట్స్ బార్ ఓనర్
* తొమ్మిది సంస్థల్లో సేల్స్ మేనేజర్
* బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్
* పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అనుసంధాన అధికారి
* కోక్ హెడ్
* మౌంటేనియర్
* డీప్ సీ డైవర్
* నేషనల్ రికార్డ్ ఓనర్
* ఆర్మీ కేడెట్స్ ఇన్ స్ట్రక్టర్

ఇలా ఎన్నో పనులు చేశారు. చివరికి ఫుట్ బాల్ వైపు రంజిత్ దృష్టి మళ్లింది. పంజాబ్ లో స్థానికంగా ఉండే ఓ ఫుట్ బాల్ టీమ్ కి గోల్ కీపర్ గా ఉన్నారు. ఆ తర్వాత మెల్లగా టీమ్ ని ఏర్పాటు చేశారు. అదే మినర్వా ఫుట్ బాల్ క్లబ్. ఫుట్ బాల్ క్రీడ పై ఆసక్తి ఉన్నవారిని సెలెక్ట్ చేశారు. వారికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఆ జట్టుని దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ పోటీలకు పంపారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏకంగా మినర్వా ఫుట్ బాల్ క్లబ్ ఓనర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు దాని పేరు మారింది. పంజాబ్ ఫుట్ బాల్ క్లబ్ అయ్యింది.    

ఇలా ఓ గ్యాంగ్ స్టర్ స్థాయి నుంచి సెలబ్రిటీగా మారారు రంజిత్ బజాజ్. ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. వాటన్నింటి క్రాస్ చేసి నిలదొక్కుకున్నారు. కృషి పట్టుదలతో లైఫ్ లో సక్సెస్ అయ్యారు.