Chhattisgarh Election 2023 : నాణాలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి .. తిరస్కరించిన అధికారులు

ఓ వ్యక్తి నామినేషన్ వేసేందుకు చిల్లర నాణాలతో వెళ్లాడు. దీంతో అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు.

Chhattisgarh Election 2023 : నాణాలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి .. తిరస్కరించిన అధికారులు

ganesh das mahant nomination Reject

Chhattisgarh ganesh das mahant nomination Reject : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చత్తీస్ గఢ్ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా చత్తీస్ గఢ్ లో ఓ వ్యక్తి నామినేషన్ వేసేందుకు చిల్లర నాణాలతో వెళ్లాడు. దీంతో అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌ లో అఖిల భారత ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు గణేశ్‌దాస్‌ మహంత్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. కోర్బా స్థానం నుంచి పోటీ చేయాలని భావించి..మంగళవారం (అక్టోబర్ 31,2023) తుల్సీనగర్‌ బస్తీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ వేసేందుకు చెల్లించాల్సిన డబ్బును చిల్లర నాణాల రూపంలో తీసుకొచ్చారు.

రూ.10 వేలను కాయిన్స్ రూపంలో అధికారులకు ఇవ్వబోయారు. వాటిలో అన్నీ రూపాయి, రెండు, 5 రూపాయల నాణేలే ఉండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈసీ అధికారులు మాట్లాడుతు.. రూ.వెయ్యి వరకు మాత్రమే నాణేల రూపంలో తీసుకోడానికి అనుమతి ఉందని..రూ.10వేలను చిల్లరగా తీసుకోలేం అని తేల్చి చెప్పారు. దీంతో గణేశ్ దాస్ షాక్ అయ్యారు.

Mini Pink Bullet : బుల్లి బుల్లెట్ బండి భలే ఉందే .. !!

మంగళవారం ఎన్నికల నామినేషన్ల చివరిరోజు కావడంతో..చిల్లర నాణాలు తెచ్చిన కారణంగా ఆయన నామినేషన్ వేయలేకపోయారు. దీంతో ఆయన తెగ బాధపడిపోయారు. చివరి వరకు వచ్చి నామినేషన్ వేసే సమయంలో ఇటువంటి ఇబ్బంది వస్తుందని ఊహించలేకపోయానని తన వద్ద అంత మొత్తం లేకపోవటంతో గత నాలుగేళ్లుగా డ్రైవర్ల యూనియన్‌ సభ్యులు ఇస్తున్న చిల్లరను జమ చేసి ఈ డబ్బునే తీసుకొచ్చానని వాపోయారు.

కాగా కొంతమంది అభ్యర్ధులు వైరల్ కావటానికి ఇటువంటివి చేస్తుంటారు. కానీ గణేశ్‌దాస్‌ మాత్రం తన పరిస్థితిని బట్టి ఇలా చిల్లర నాణాలతో వచ్చి నామినేషన్ వేయలేక వట్టి చేతులతోనే నిరాశగా వెనుతిరిగి వెళ్లారు. కాగా..రూ.1000 మాత్రమే నాణాల రూపంలో తీసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మిగిలిన రూ.9,000లు నోట్ల రూపంలో చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ రూల్ తెలియకపోవటంతో గణేశ్‌దాస్‌ నామినేషన్ వేయలేకపోయారు.