Jobs : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 376 పోస్టుల భర్తీ

అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 09గా నిర్ణయించారు.

Jobs : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 376 పోస్టుల భర్తీ

Bank Of Baroda

Jobs : ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ విభాగం ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 376 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు 326, ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు01.11.2021 నాటికి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌, ఇతర పద్ధతుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 09గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bankofbaroda.in/