Karnataka ACB : కర్నాటకలో ఏసీబీ దాడులు..డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు, వీడియో వైరల్

ఓ జూనియర్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరపగా డబ్బులు డ్రైనేజీ పైపులో పెట్టడం గమనార్హం. ఏసీబీ అధికారులకు దొరక్కకుండా..డబ్బుల కట్టలను అందులో దాచిపెట్టాడు.

10TV Telugu News

Karnataka ACB : అధికంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచామవతారం ఎత్తుతున్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూనే…మరో చేత్తో లంచాలు తీసుకుంటున్నారు. ఎన్నిమార్లు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా..ఇతరుల లంచావతరాల్లో మార్పు రావడం లేదు. ఏసీబీ అధికారులకు దొరకకుండా ఉండేందుకు డబ్బులను ఎక్కడెక్కడో దాచేస్తున్నారు. కానీ ఏసీబీ అధికారుల సోదాలు జరిపి ఆ డబ్బులను స్వాధీనం చేసుకుంటున్నారు.

Read More : Odisha CM Convoy : ఒడిషా సీఎం కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

తాజాగా..కర్నాటక రాష్ట్రంలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు విభాగాలకు చెందిన 15 మంది అధికారుల నివాసాలపై దాడులు నిర్వహించింది. 2021, నవంబర్ 24వ తేదీ బుధవారం ఉదయం నుంచి 68 ప్రదేశాల్లో సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారుల నివాసాల నుంచి డబ్బులు, విలువైన బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read More : SBI కస్టమర్లకు ముఖ్య గమనిక.. వెంటనే ఆ పని చేయండి

PWD జూనియర్ ఇంజనీర్ ఎస్.ఎం బిరదార్, బళ్లారిలో రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ కె.ఎస్.శివానంద్, సవదత్తి సహకార అభివృద్ధి అధికారి ఎ.కె.మస్తీ, గోకాక్..సీనియర్ మోటార్ ఇన్స్ పెక్టర్ సదాశివ మరలింగన్న నవర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బెలాగావిలో ఉన్న హెస్కామ్ లో గ్రేడ్ సి ఉద్యోగి నాథాజీ హీరాజీ పాటిల్, స్మార్ట్ సిటీ మంగళూరు కేఎస్. లింగేగౌడ, మాండ్య HLBC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు టి.ఎస్.రుద్రేశప్ప నివాసాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాదాపు 8 మంది ఏసీపీలు, 100 మంది ఆఫీసర్లు, 300 మంది ఏసీబీ సిబ్బందితో ఈ రైడ్స్ నిర్వహిస్తున్నారు.

Read More : Govt scrapage policy : పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే..కొత్త వాహనాలకు రాయితీ : కేంద్రం

అయితే..ఓ జూనియర్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరపగా డబ్బులు డ్రైనేజీ పైపులో పెట్టడం గమనార్హం. ఏసీబీ అధికారులకు దొరక్కకుండా..డబ్బుల కట్టలను అందులో దాచిపెట్టాడు. అయితే..వారికి అనుమానం వచ్చి..కర్ర తీసుకుని పైపులో పెట్టగా..అందులో నుంచి నోట్ల కట్టలు కింద పడ్డాయి. ప్లాస్టిక్ డబ్బా నోట్లతో పూర్తిగా నిండిపోయింది. మొత్తం రూ. 54 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, డ్రైనేజీ పైపులో నుంచి రూ. 13 లక్షలను రికవరీ చేసినట్లు ACB  North Eastern Range SP తెలిపారు. దీనికి సంబంధించని వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కలబుర్గిలో ఉన్న ఇతని నివాసం నుంచి మొత్తం రూ. 13 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.