Rupee Falls: మరింత పతనమైన రూపాయి విలువ.. డాలరుతో అత్యంత కనిష్టానికి చేరిక.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం రూపాయి విలువ 43 పైసలు తగ్గి, 81.52 వద్ద కొనసాగుతోంది. మరోవైపు భారత మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Rupee Falls: మరింత పతనమైన రూపాయి విలువ.. డాలరుతో అత్యంత కనిష్టానికి చేరిక.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

Rupee Falls: రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలరుతో పోలిస్తే 43 పైసలు తగ్గి, 81.52 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నాటికి అమెరికా కరెన్సీ బలపడటం, ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి మరింత దిగజారింది.

Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు

గత శుక్రవారం 30 పైసలు తగ్గి, 81.47కు చేరగా, నేడు మరింత దిగజారి అత్యంత కనిష్టానికి చేరింది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అడ్డుకునేందుకు వడ్డీ రేట్లు పెంచేందుకు ఫెడరల్ బ్యాంక్ ప్రయత్నించింది. దీని ప్రభావం భారత మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో మన దేశం కూడా అప్రమత్తమైంది. దీనిపై ఆర్బీఐ దృష్టిపెట్టింది. ఈ వారంలో కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గుదలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందుకే 50 వరకు బేసిస్ పాయింట్స్ పెంచాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 970 పాయింట్లు తగ్గి 57,129 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 312 పాయింట్లు తగ్గి 17,015 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ రోజు ఈక్విటీల పతనం వల్ల ఇన్వెస్టర్లు కోల్పోయిన పెట్టుబడుల విలువ రూ.7 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ ఏకంగా 4 శాతం పడిపోయింది.