Satyendar Jain : ‘తోడు కావాలి’ అంటూ సత్యేందర్‌ జైన్‌ విన్నపం .. ఇద్దరు ఖైదీలను ఇచ్చిన సూపరింటెండెంట్‌ .. ఇది తీహార్ జైలేనా? అంటూ విమర్శలు

నాకు బోర్ కొడుతోంది. టైమ్ పాస్ కోసం నాకు తోడు కావాలి అని ఓ ఖైదీ అడిగారు. ఆ ఖైదీ వీఐపీ కదా..దీంతో జైలు సూపరింటెండెంట్‌ పాపం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వేరే సెల్ లో ఉన్న ఇద్దరు ఖైదీలను సదరు వీఐపీ ఖైదీకి తోడిచ్చారు. మరి అది జైలు అనుకున్నారో లేదా టైమ్ పాస్ కావాలంటే ప్రొవైడ్ చేసే సెంటర్ అనుకున్నారో మరి..తీహార్ జైలులాంటి జైల్లో కూడా ఇటువంటి అవకాశాలుంటాయా? అనిపించేలా ఉంది సదరు సూపరింటెండెంట్‌ గారు చేసిన పని..

Satyendar Jain : ‘తోడు కావాలి’ అంటూ సత్యేందర్‌ జైన్‌ విన్నపం .. ఇద్దరు ఖైదీలను ఇచ్చిన సూపరింటెండెంట్‌ .. ఇది తీహార్  జైలేనా? అంటూ విమర్శలు

Satyendar Jain In Tihar Jail

Satyendar Jain : నాకు తోడు కావాలి అంటూ జైల్లో ఖైదీలు అంటే జైలు అధికారులు ఏమంటారు? ఇది జైలు అనుకున్నావా? లేదా నీ ఇల్లు అనుకున్నావా?నోరు మూస్కుని పడుండు లేదంటా తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇస్తారు. కానీ నగదు అక్రమ చలామణి కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌ కు మాత్రం ఆ రూల్స్ వర్తించవులా ఉంది. ఎందుకంటే ఆయనకు బోర్ కొడుతోందని జైలు అధికారి ఇద్దరు ఖైదీలను టైమ్ పాస్ కోసం పంపించారు. సత్యేంద్ర జైన్ కు  జైల్లో బోర్ కొడుతోందని అడగ్గానే ఇద్దరు ఖైదీలను తోడు పంపించారు. సత్యేంద్ర సెల్ లో ఒక్కరే ఉండటంతో ‘లోన్లీ’గా ఫీల్ అవుతున్నారట.. డిప్రెస్డ్ అవుతున్నారట. దీంతో సత్యేంద్ర ‘నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను..నాకు తోడు కావాలి’ అంటూ జైలు అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో పాపం జైలు సూపరింటెండెంట్‌ కు జాలి వేసింది. వెంటనే ఆయన సత్యేంద్ర విన్నపాన్ని మన్నించారు. ఆయనకు ‘తోడు కోసం’వేరే సెల్ లో ఉన్న ఇద్దరు ఖైదీలను సత్యేంద్ర ఉండే సెల్ కు షిప్ట్ చేశారు. అదే సదరు సూపరింటెండెంట్‌ కు తలనొప్పిగా మారింది. సూపరింటెండెంట్‌ కు సంజాయిసీ ఇవ్వాలని డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ బెనివాల్‌ నోటీసులు జారీ చేశారు.

నగదు అక్రమ చలామణి కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌కు తోడుగా ఉండేందుకు ఆయన సెల్‌లోకి సూపరింటెండెంట్‌ ఇద్దరు ఖైదీలను బదిలీ చేయడం వివాదంగా మారింది. ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. దీంతో తీహార్ జైలు అడ్మినిస్ట్రేషన్ జైలు ఏడో నంబరు జైలు సూపరింటెండెంట్‌కు ఉన్నతాధికారుల నుంచి నోటీసు అందటంతో కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకున్న సదరు అధికారి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Satyendar Jain Video: ఇది జైలు కాదు.. రిసార్ట్..! జైలు నుంచి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల

నగదు అక్రమ చలామణి ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తిహాడ్‌ కారాగారంలోని ఏడో నంబరు జైల్లో అత్యంత భద్రత కలిగిన గదిలో ఉంటున్నారు. ఈక్రమంలో ఆయన ‘‘ఒంటరితనం వల్ల ఆందోళనకు గురవుతున్నాను. నేనుంటున్న గదిలో ఇద్దరు వ్యక్తుల్ని నాకు తోడుగా ఉంచాలని కోరుతున్నా’’ అంటూ మే 11న జైలు అధికారులకు లేఖ రాశారు. దీంతో జైలు సూపరింటెండెంట్‌ ఇద్దరు ఖైదీలను ఆయన గదికి బదిలీ చేశారు.

జైలు పాలనాధికారులతో చర్చించకుండా ఆ అధికారి తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆయనకు డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ బెనివాల్‌ నోటీసు జారీ చేశారు. అంతేకాదు ఏ ఖైదీలను అయితే సత్యేంద్ర సెల్ కు బదిలీ చేశారో ఆ ఖైదీలను తిరిగి వారి సెల్ కు బదిలీ చేశారు. కాగా గత కొన్నాళ్ల క్రితం సత్యేంద్ర జైల్లో ఓ వ్యక్తితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

AAP Minister Satyendra Jain Massage : తీహార్ జైల్లో ఆప్ నేత సత్యేంద్రజైన్‌కు మసాజ్ వ్యవహారం .. మంత్రికి మసాజ్ చేసింది ఎవరంటే..