SBI Jobs: ఎస్బీఐలో 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 48 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5నుంచి ఫిబ్రవరి 25వరకూ అప్లికేషన్ ప్రక్రియ...

SBI Jobs: ఎస్బీఐలో 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Sbi Jobs

SBI Jobs: ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 48 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5నుంచి ఫిబ్రవరి 25వరకూ అప్లికేషన్ ప్రక్రియ జరగనుంది. ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్) పోస్టుకు 15ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ అండ్ స్విచ్చింగ్)పోస్టుకు 33ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ లో పేర్కొంది.

అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయస్సు 40సంవత్సరాలు.

SBI: గర్భిణీలను ఎస్బీఐ ఉద్యోగాల్లోకి తీసుకోదట

అధికారిక నోటిఫికేషన్ వివరాల ప్రకారం.. స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. కటాఫ్ మార్క్స్ ప్రకారం వేరొకరితో సమానంగా స్కోరు చేస్తే.. వారి వయస్సు ఆధారంగా జాబితాను ప్రిపేర్ చేస్తారు’ అని ఉంది.

ఉద్యోగాభ్యర్థులు కచ్చితంగా ఏదైనా డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి జనరల్/ఓబీసీ/ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ.750గా ఉండగా ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేకుండానే పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.