SCR Special Trains : సికింద్రాబాద్-అగర్తలా మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని  దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి  ఈశాన్య రాష్ఠ్రం త్రిపుర రాజధాని  అగర్తలాకు 6 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది.

SCR Special Trains : సికింద్రాబాద్-అగర్తలా మధ్య ప్రత్యేక రైళ్లు

Secunderabad Agrtala Special Trains

SCR Special Trains :  ప్రయాణికుల రద్దీని  దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి  ఈశాన్య రాష్ఠ్రం త్రిపుర రాజధాని  అగర్తలాకు 6 ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. రైలు నెంబర్ 0730 సికింద్రాబాద్-అగర్తలా మధ్య నడిచే   రైలు ఈనెల 8,15,22 తేదీ, సోమవారాల్లో సికింద్రాబాద్ లో సాయంత్రం గం.4-35కి బయలుదేరి గురువారం తెల్లవారు ఝూమున 3 గంటలకు అగర్తలా చేరుకుంటాయి.

రైలు నెంబరు 07029  అగర్తలా-సికింద్రాబాద్ మధ్య నడిచే  రైలు అగర్తలాలో 12,19,26 తేదీ శుక్రవారాల్లో ఉదయం గం.6-10 కి బయలు దేరి ఆదివారం మధ్యాహ్నం గం. 2-50కి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
Also Read : Firecrackers Blast : బాబోయ్… బైక్‌పై వెళ్తుండగా బాంబుల్లా పేలిన టపాసులు.. తండ్రి, ఏడేళ్ల కొడుకు మృతి
సికింద్రాబాద్ నుంచి బయలు దేరే రైలు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం, భువనేశ్వర్, గౌహతి, అంబాసా స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.