Shah Faesal: రాజకీయాలకు గుడ్ బై.. మళ్లీ సివిల్ సర్వీసులో చేరిన యూపీఎస్‭సీ టాపర్

జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి యూపీఎస్‌సీ టాపర్ షా ఫైజల్. 2009 యూపీఎస్‌సీ ఫలితాలు వచ్చిన అనంతరం ప్రచారంలోకి వచ్చారు. 2019లో ఎనిమిది నెలల పాటు ఉద్యోగం చేసిన అనంతరం.. కశ్మీర్‌లో ముస్లింల హత్యలు ఆగడం లేదని, ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని, ముస్లింలను అణచివేస్తున్నారనే కారణాలతో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం 'జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్' అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు.

Shah Faesal: రాజకీయాలకు గుడ్ బై.. మళ్లీ సివిల్ సర్వీసులో చేరిన యూపీఎస్‭సీ టాపర్

Shah Faesal Back To Civil Service After Politics

Shah Faesal: సివిల్ సర్వీసును వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన 2009 బ్యాచ్ యూపీఎస్‌పీ టాపర్ షా ఫైజల్ తిరిగి సివిల్ సర్వీసులో చేరారు. ఆయనను పర్యాటక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అతడిని కేంద్ర పర్యాటక శాఖలో నియమించబోతున్నట్లు రెండు రోజుల క్రితమే డిపార్ట్‭మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, క్రితం తాను తిరిగి సివిల్ సర్వీసులో చేరతానని నాలుగు నెలల షా ఫైజల్ పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయనను ఏప్రిల్‭లోనే సర్వీసులోకి తీసుకున్నప్పటికీ తాజాగా ఆయనకు పోస్టింగ్ అప్పగించారు.

2019 ఆగస్టులో తన ఉద్యోగానికి షా ఫైజల్ రాజీనామ చేశారు. అయితే ఆయన రాజీనామాను కేంద్ర హోంశాఖ ఆమోదించలేదు. కాగా, షాఫైజల్ తిరిగి సర్వీస్‌లో చేరనున్నట్లు కేంద్ర హోంశాఖ ఏప్రిల్ 28న ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు షా ఫైజల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘8 నెలల (జనవరి 2019 నుంచి ఆగస్టు 2019) ఉద్యోగ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో స్నేహితులు, ఉద్యోగం, ప్రాతినిధ్యం, ప్రజా విశ్వాసం అన్ని కోల్పోయాను. నా భావజాలం నన్ను కొంత దెబ్బ తీసినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఎదురు దెబ్బలు మనల్ని బలపరుస్తాయి, మరొక అవకాశం ఎప్పుడూ విలువైందే. నా జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నాను’’ అని ట్వీట్ చేశారు.

జమ్మూ కశ్మీర్ నుంచి మొదటి యూపీఎస్‌సీ టాపర్ షా ఫైజల్. 2009 యూపీఎస్‌సీ ఫలితాలు వచ్చిన అనంతరం ప్రచారంలోకి వచ్చారు. 2019లో ఎనిమిది నెలల పాటు ఉద్యోగం చేసిన అనంతరం.. కశ్మీర్‌లో ముస్లింల హత్యలు ఆగడం లేదని, ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని, ముస్లింలను అణచివేస్తున్నారనే కారణాలతో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ‘జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్’ అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు.

Jammu and Kashmir: తీవ్రవాదులతో లింకులు… నలుగురు ఉద్యోగుల తొలగింపు