Jammu and Kashmir: తీవ్రవాదులతో లింకులు… నలుగురు ఉద్యోగుల తొలగింపు

తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని జమ్ము-కాశ్మీర్‌ ప్రభుత్వం తొలగించింది. రాజ్యాంగంలోని 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు.

Jammu and Kashmir: తీవ్రవాదులతో లింకులు… నలుగురు ఉద్యోగుల తొలగింపు

Jammu and Kashmir: తీవ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జమ్ము-కాశ్మీర్‌లో తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని సర్వీసులోంచి తొలగించింది. ఈ మేరకు జమ్ము-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిర్ణయం తీసుకున్నారు. వీరిలో హిజ్బుల్ ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు సయ్యద్ అబ్దుల్ ముయీద్‌తోపాటు, తీవ్రవాద నేత ఫరూక్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే భార్య అస్సాబా అర్జూమంద్ ఖాన్ ఉన్నారు.

Chinese Manjha: సోదరి ఇంటికి వెళ్తూ.. చైనా మాంజా గొంతుకు చుట్టుకుని యువకుడి మృతి

వీరితోపాటు ముహీత్ అహ్మద్ భట్, మాజిద్ హుస్సేన్ ఖాద్రి కూడా ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఈ నలుగురికీ తీవ్రవాదులతో సంబంధాలున్నాయి. ఫరూక్ అహ్మద్ భార్య అస్సాబాకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయి. ఆమె 2011లో జమ్ము-కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. తీవ్రవాదులకు సాయం చేసేందుకు ఆమె ఎక్కువగా విదేశీ పర్యటనలు చేసేది. నిధుల సమీకరణలో తోడ్పడేది. విదేశాలకు వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టుల ద్వారా వెళ్లి, వచ్చేటప్పుడు మాత్రం రోడ్డు మార్గంలో వచ్చేది. అంటే నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చేది.

Message from space: స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. అంతరిక్షం నుంచి భారత్‌కు సందేశం

సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు సయ్యద్ అబ్దుల్ ముయీద్, అనేక తీవ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకునేవాడు. అతడు ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కాశ్మీర్ యూనివర్సిటీలో సైంటిస్టుగా పనిచేస్తున్న ముహీత్ అహ్మద్, 2016లో జరిగిన అనేక అల్లర్లకు కారణమయ్యాడు. ఈ అల్లర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మాజిద్ హుస్సేన్ ఖాద్రి… పాక్ తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. దేశంలోనూ పలు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు.