Message from space: స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. అంతరిక్షం నుంచి భారత్‌కు సందేశం

75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న భారత్‌కు అనేక దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా అంతరిక్షం నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న సమంత అనే వ్యోమగాగి భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

Message from space: స్వాతంత్ర వజ్రోత్సవ వేళ.. అంతరిక్షం నుంచి భారత్‌కు సందేశం

Message from space: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్న భారత్‌కు అంతరిక్షం నుంచి సందేశం అందింది. సమంత క్రిస్టోఫొరెటి అనే వ్యోమగామి భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో పని చేస్తున్న సమంత అంతరిక్షం నుంచి ఒక వీడియో మెసేజ్ పంపారు.

Chinese Manjha: సోదరి ఇంటికి వెళ్తూ.. చైనా మాంజా గొంతుకు చుట్టుకుని యువకుడి మృతి

అందులో 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న భారత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర సంస్థల తరపున శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)’ వచ్చే ఏడాది చేపట్టనున్న ‘గగన్‌యాన్’ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’తోపాటు ‘నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్’ గురించి కూడా ప్రస్తావించారు. ఇస్రోతో కలిసి అనేక అంతర్జాతీయ సంస్థలు పలు స్పేస్, సైన్స్ మిషన్స్ కోసం పనిచేస్తున్నాయన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, భూమిపై విపత్తులను గుర్తించడానికి దోహదపడే నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్‌ను అభివృద్ధి చేయడం కోసం ఇస్రో కృషి చేస్తోందన్నారు.

Revanth Reddy: కోమటిరెడ్డికి సారీ చెప్పిన రేవంత్.. వీడియో విడుదల

నేటికీ ఈ సంస్థల మధ్య సహకారం కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు ఈ వీడియో మెసేజ్‌పై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. నాసాతోపాటు ఇతర సంస్థలకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.