అత్యాచార ఘటనలపై చర్చ : విపక్షాలపై స్మృతీ ఇరానీ ఆగ్రహం

  • Published By: madhu ,Published On : December 6, 2019 / 07:44 AM IST
అత్యాచార ఘటనలపై చర్చ : విపక్షాలపై స్మృతీ ఇరానీ ఆగ్రహం

పార్లమెంట్‌లో అత్యాచార ఘటనలపై చర్చ జరిగింది. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశాల్లో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో జరిగిన దిశా నిందితుల ఎన్ కౌంటర్, ఉన్నావ్ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సభలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ మినిస్టర్, బీజేపీ సభ్యురాలు స్మృతి ఇరానీ విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన అభిప్రాయం చెప్పుకొనేలా అవకాశం ఇవ్వకుండా..అడ్డుతగులుకోవడం మంచిది కాదంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్, ఉన్నావ్.. ఘటనపై సభ్యులు మాట్లాడారని, కానీ మాల్దా జరిగిన ఘటనను ఎందుకు ప్రస్తావించలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రేప్ ఘటనను ఒక వెపన్‌లా ఉపయోగించుకున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. దీనిపై విపక్ష సభ్యులు అడ్డు తగిలారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిప్రాయం చెప్పుకొనే అవకాశం తనకు ఉందని, అత్యాచారం, ఆపై హత్యలు జరగడం ఖండిస్తున్నట్లు, కఠినంగా శిక్షించాలన్నారు. కానీ..ఇలాంటి ఘటనలపై రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా..న్యాయం జరగాలని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్మృతి ఇరానీ. 
Read More : జస్టిస్ దిశ : జాతీయ నేతలు ఏమన్నారంటే