ఇంటర్నెట్ లేదు..గోడలపై పాఠాలు, టీచర్ల వినూత్న ప్రయత్నం

10TV Telugu News

కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీచర్లు వినూత్నంగా ఆలోచించారు.
నీలమ్ నగర్ ప్రాంతంలోని 300 ఇళ్ల గోడలపై పాఠాలను పేయింటింగ్ వేయించారు. అక్కడికక్కడనే టీచర్లు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు చదువు చెబుతున్నారు.
https://10tv.in/pm-modi-to-inaugurate-college-building-of-central-agricultural-university-in-jhansi/
విద్యార్థులు దగ్గరి దగ్గర కూర్చొకుండా..దూరం దూరంగా కూర్చొబెడుతున్నారు. Shri Dharmanna Sadul Prashala లోని ప్రైమరీ స్కూల్ లో 17 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతోందని, ఇది సౌకర్యవంతంగా ఉందని Nilamnagar ప్రాంతంలోని Asha Marathi Vidyalaya primary school ఉపాధ్యాయుడు రామ్ గైక్వాడ్ వెల్లడించారు.
ఇక్కడ నివాసం ఉండే తల్లిదండ్రులు నిరుపేదలని, వస్త్ర విభాగాల్లో పని చేస్తుంటారని తెలిపారు. ఆన్ లైన్ కారణంగా..మంచి ఇంటర్నెట్ బ్రాండ్ విడ్త్ ఉన్న స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుందని, కానీ అంత ఖరీదు పెట్టి కొనలేని పరిస్థితిలో వారున్నారని వెల్లడించారు.

దీనికారణంగా…ఇళ్ల గోడలపై పాఠాలు రాసి..చదివించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే విధంగా, వారిని ఆకట్టుకొనే విధంగా తాము పెయింట్ వేయించామన్నారు. గణిత సూత్రాలు, అక్షరాలు, సంఖ్యలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారని, స్మార్ట్ ఫోన్లు ఉన్న వారికి ఆన్ లైన్ లో క్లాసులు చెప్పడం జరగుతోందన్నారు.