Covid-19 Victims: ఆంధ్ర, బీహార్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బుధవారం సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు అందజేయాల్సిన నష్టపరిహారం ఆలస్యం కావడమేంటని ప్రశ్నించింది.

Covid-19 Victims: ఆంధ్ర, బీహార్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం కోర్టు సమన్లు

Covid Ex Gratia

Covid-19 Victims: ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బుధవారం సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు అందజేయాల్సిన నష్టపరిహారం ఆలస్యం కావడమేంటని ప్రశ్నించింది. గతతీర్పులోనే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటూ తీర్పుఇచ్చినప్పటికీ రాష్ట్రాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఈ మేరకు సుప్రీం సీరియస్ అవుతూ.. మధ్యాహ్నం 2గంటల కల్లా వర్చువల్ ఎంక్వైరీకి హాజరుకావాలని తెలిపింది. జస్టిస్ ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. చీఫ్ సెక్రటరీలు చట్టానికంటే ఎక్కువ కాదు. ఇద్దరూ విచారణకు హాజరుకావాల్సిదేనని చెప్పింది.

కొవిడ్ మృతి కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గతంలోనే కోర్టునుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలో కరోనా కల్లోలం