Tajmahal: “తాజ్‌మహల్ భూభాగం జైపూర్ రాజవంశీయులదే”

తాజ్ మహల్ నిర్మించిన స్థలం నిజానికి జైపూర్ రాజవంశీయులది అంటున్నారు బీజేపీ ఎంపీ దివ్యకుమారి. దానిని మొగల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనపరచుకున్నారంటూ కామెంట్ చేశారు.

Tajmahal: “తాజ్‌మహల్ భూభాగం జైపూర్ రాజవంశీయులదే”

Taj Mahal

Tajmahal: తాజ్ మహల్ నిర్మించిన స్థలం నిజానికి జైపూర్ రాజవంశీయులది అంటున్నారు బీజేపీ ఎంపీ దివ్యకుమారి. దానిని మొగల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనపరచుకున్నారంటూ కామెంట్ చేశారు.

తాజ్‌మహల్ లోపల ఉన్న 20 గదుల్లో ఉన్న హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ రజనీష్ సింగ్ మే 4న దాఖలు చేసిన ఈ పిటిషన్‌ తర్వాత స్పందించిన పలువురు రాజకీయ ప్రముఖుల్లో బీజేపీ ఎంపీ ఒకరు.

Read Also : తాజ్ మహల్ మిస్టరీ వీడేనా? ఆ 22 గదులు తెరవటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తుందా?

షాజహాన్ ఆక్రమించుకున్న స్థలం గురించి మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని దివ్యకుమారి అన్నారు. గదులు తెరిచి విచారణ జరిపించాలని పిటిషన్‌ను ఆమె ప్రస్తావించారు.

“అప్పట్లో న్యాయవ్యవస్థ లేనందున అప్పీల్ చేయలేం. రికార్డులను పరిశీలించిన తర్వాతే విషయాలు తెలుస్తాయి. అక్కడ గదులు ఎందుకు తాళం వేశారో ప్రజలకు తెలియాలి. అక్కడ చాలా గదులు సీలు చేశారు. తలుపుల వెనుక ఏమి ఉందో పరిశీలించాలి, ” అని బీజేపీ ఎంపీ కుమారి చెప్పారు.