Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు, IMD ‘రెడ్’ అలర్ట్.. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం

చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు, IMD ‘రెడ్’ అలర్ట్.. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం

Tamil Nadu Heavy Rains (1)

Tamil Nadu Heavy Rains: చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు విపరీతంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. ప్రధానంగా తమిళనాడు, కేరళ, మహే, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తాలో నవంబర్ 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

ఈ క్రమంలోనే చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం చెంగల్ పట్టు జిల్లాలకు హై అలెర్ట్ జారీచేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నట్లుగా వాతావరణశాఖ వెల్లడించింది. చెన్నై శివారులోని పుళాల్, చెంబారక్కం రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో విపరీతంగా పెరుగుతుతుంది. నిన్న ఒక్కరోజే కొన్ని ప్రాంతాల్లో 220 మిల్లీలీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలో నిన్నటి నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

తమిళనాడులో ముందుగానే ముఖ్యమంత్రి స్టాలిన్ అలర్ట్ అయ్యారు. ప్రధాని మోదీతో కూడా సహాయ చర్యల విషయంలో ఫోనులో మాట్లాడారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తమిళనాడుకు నాలుగు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రాగా.. చెన్నై నగరంలో పలు ప్రాంతాలను స్వయంగా సందర్శించారు సీఎం స్టాలిన్. సహాయ కార్యక్రమాలుపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నవారికి ఆహారం దుస్తులు పంపిణీ చేశారు స్టాలిన్.

అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. వర్షాల కారణంగా తమిళనాడు 19 జిల్లాల్లో స్కూల్స్, కాలేజ్‌లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 17 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. 44 పునరావాస కేంద్రాల్లో 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది.

ముంపు బాధితుల పునరావాసం కోసం చెన్నై లోని ప్రభుత్వ పాఠశాలలు, మండపాలు వెంటనే తెరవాలని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 10,11,12 తేదీలలో బంగాళాఖాతంలో చేపల వేట నిషేధించింది ప్రభుత్వం.