Chain Snatcher Arrest : ముంబైలో పట్టుబడ్డ చైన్ స్నాచర్ ఉమేశ్ ఖాతిక్.. హైదరాబాద్‌లో 7 చైన్ స్నాచింగ్‌లు

హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డ కేటుగాడు ఉమేశ్‌ ఖాతిక్‌ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు.

Chain Snatcher Arrest : ముంబైలో పట్టుబడ్డ చైన్ స్నాచర్ ఉమేశ్ ఖాతిక్.. హైదరాబాద్‌లో 7 చైన్ స్నాచింగ్‌లు

Chain Snatcher

chain snatcher Umesh Khatik arrest : చూడడానికి స్మార్ట్‌గా ఉంటాడు. డ్రెస్..గడ్డం..గాగుల్స్‌..చూస్తే రిచీ కిడ్‌లా ఉంటాడు. లగ్జరీ రూమ్స్‌లో బస చేస్తాడు. సీన్‌ కట్ చేస్తే…ఫస్ట్‌.. బైక్‌ను చోరీ చేస్తాడు. ఆ తర్వాత మహిళల మెడలో గొలుసులను తెంచేస్తాడు. రెండు, మూడు రోజులు ఇదే పనిమీద ఉంటాడు. అందిన కాడిన గొలుసులు లాగేసి ఎవరికి దొరకకుండా తప్పించుకుపోతాడు. ఇలానే గ్రేటర్‌ హైదరాబాద్‌లో మూడు రోజులు క్రితం చోరీలు చేశాడు. ఒకే రోజు ఆరు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ నెల 19న ఆరు గంటల్లో ఆరు స్నాచింగ్‌లు చేసి పోలీసులుకు సైతం సవాల్‌ విసిరిన ఆ చైన్ స్నాచర్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు.

హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డ కేటుగాడు ఉమేశ్‌ ఖాతిక్‌ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులను సైతం పరుగులు పెట్టించిన ఉమేశ్‌ ఖాతిక్‌ అంత ఈజీగా దొరకలేదు. ఇతని కోసం హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబరాబాద్‌ ఎస్‌.వో.టి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు.

Dalitbandhu : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు

గోపాలపురం ఏసీపీ, క్రైమ్‌ పార్టీ పోలీసులు ఇటు హైదరాబాద్‌లో అటు మహారాష్ట్ర, గుజరాత్‌లో జల్లెడ పట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ విస్తృతంగా పరిశీలించారు. వాణిజ్య నగరాలైన ముంబై, అహ్మదాబాద్‌లో విస్తృతంగా గాలించారు. దీపక్‌ అనే వ్యక్తితో కలిసి గుజరాత్‌లో సైతం ఉమేశ్‌ అనేక నేరాలకు పాల్పడినట్లు హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఇంత విస్తృతంగా గాలిస్తేనే కానీ ఉమేష్‌ ఖాతిక్‌ పోలీసులుకు చిక్కలేదు.

ఉమేశ్‌ ఖాతిక్‌కు ఘనమైన నేర చరిత్ర ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన ఇతగాడు.. గుజరాత్, మహారాష్ట్రల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 7 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడానికి ముందు రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 18న నాంపల్లి రైల్వేస్టేషన్‌లో దిగిన ఉమేశ్‌ …ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా మెజిస్టిక్‌ హోటల్‌కు వెళ్లాడు. రూమ్‌ నెంబర్‌ 204లో బస చేశాడు.

AP High Court : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

ఆ సమయంలోనే ఒంటరి మహిళలను టార్గెట్ చేశాడు. 19వ తేదీ పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు మెజిస్టిక్‌లో రూమ్‌ ఖాళీ చేసి ముంబై చెక్కేశాడు. అయితే హోటల్‌ సీసీ ఫుటేజ్‌ దర్యాప్తులో కీలకంగా మారింది. హోటల్‌ రిసెప్షన్‌లో ఐడీ ప్రూఫ్‌, ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ కార్డు వివరాలను పక్కాగా ఇచ్చాడు చైన్‌ స్నాచర్‌. దీంతో ఇన్వెస్టిగేషన్‌లో పురోగతి కనిపించింది.

హోటల్‌ సిబ్బంది నుంచి సేకరించిన వివరాలతో ముంబై, అహ్మదాబాద్‌ పోలీసులను సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించారు. చివరకు ఉమేశ్‌ ఖాతిక్‌ ముంబైలో పట్టుబడ్డాడు. తమ హోటల్‌కు ఎవరు వచ్చినా అడ్రస్‌ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్‌ తీసుకుంటామన్నారు మెజిస్టిక్‌ హోటల్‌ జనరల్‌ మేనేజర్ సయ్యద్ సులేమాన్‌. పోలీసులు వచ్చినప్పుడు చైన్ స్నాచర్‌కు సంబంధించి అన్ని వివరాలతో పాటు సీసీ ఫుటేజ్‌ అందించామన్నారు.