COVID-19 Positive: పోలీస్ స్టేషన్లో పది మందికి కరోనా పాజిటివ్, సీల్ వేసిన అధికారులు

కరోనా మహమ్మారి సమయంలోనూ ఆపద్ధర్మానికి, నిస్సహాయులను ఆదుకోవడానికి, చట్టాన్ని కాపాడటానికి రక్షక భటులు (పోలీసులు) ప్రాణంగా పెడుతున్నారు.

COVID-19 Positive: పోలీస్ స్టేషన్లో పది మందికి కరోనా పాజిటివ్, సీల్ వేసిన అధికారులు

Police Station

COVID-19 Positive: కరోనా మహమ్మారి సమయంలోనూ ఆపద్ధర్మానికి, నిస్సహాయులను ఆదుకోవడానికి, చట్టాన్ని కాపాడటానికి రక్షక భటులు (పోలీసులు) ప్రాణంగా పెడుతున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని ఉడుపి జిల్లా పడుబిద్రి పోలీసులు డ్యూటీ చేశారు.

కానీ, ఒకేసారి స్టేషన్లో పది మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో అంతా బెంబేలెత్తిపోయారు. ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ ను 24గంటల పాటు సీల్ వేశారు. కొందరిలో జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తుండటంతో టెస్టులు చేయించుకున్నారు.

కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మిగిలిన వారందరికీ టెస్టులు చేయగా మొత్తం 10మంది పోలీసులకు పాజిటివ్ వచ్చింది. ఇన్ఫెక్షన్ సోకిన వారందరినీ క్వారంటైన్ లో ఉంచారు.