Supreme Court : న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదే : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదేనని స్పష్టం చేసింది.

Supreme Court : న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదే : సుప్రీంకోర్టు

LCV Gauri

Supreme Court : సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదేనని స్పష్టం చేసింది. మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా వేసిన పిటిషన్ ను తాము అంగీకరించబోమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనం విచారించే కేసుల్లో న్యాయవాది గౌరీ కేంద్రం తరపున వాదించారు. గౌరీకి బీజేపీతో రాజకీయ సంబంధాలున్నాయనే విమర్శలతో పాటు క్రిస్టియన్లు, ముస్లింల గురించి విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

MLA Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

రాజకీయ, విద్వేష ప్రసంగాలు ఎదుర్కొంటున్న గౌరికి మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిన్న గౌరీ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి అత్యవసర విచారణ జరిపింది. పిటిషన్ లో లేవనెత్తిన అంశం గౌరీ అర్హతలకు సంబంధించినది కాదని సుప్రీంకోర్టు తెలిపింది. గౌరీ అర్హతలను సవాల్ చేయొచ్చు.. కానీ అనుకూలతల విషయానికొస్తే కోర్టు అందులో జోక్యం చేసుకోదని చెప్పింది.

గౌరీ రాజకీయ సంబంధాలన్ని పరిశీలించిన తర్వాతే కొలీజియం ఆమె పేరును సిఫార్సు చేసిందని పేర్కొంది. ప్రస్తుతం ఆమెను అదనపు న్యాయమూర్తిగానే నియమించారని వెల్లడించింది. ఈ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా సిఫార్సు చేసే సమయంలో కొలీజియం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవచ్చని తెలిపింది.

Rahul Gandhi : మరో పాదయాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ .. ఎక్కడనుంచి ఎక్కడికంటే..

న్యాయమూర్తుల పనితీరు సంతృప్తికరంగా లేకపోతే వారిని శాశ్వత జడ్జీలుగా నియమించని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయని గుర్తు చేసింది. గౌరీ జడ్జీగా ప్రమాణస్వీకారం చేయకుండా తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.