Supreme Court : ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.

Supreme Court : ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court

Supreme Court a key Verdict : ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల కల్పనకు నిర్దిష్టమైన, కచ్చితమైన ప్రమాణాలు నిర్ధారించడంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. జస్టిస్​ నాగేశ్వర్​రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు రాష్ట్రాలు అనుసరించే విధంగా కచ్చితమైన, నిర్దిష్టమైన ఒక విధానం తీసుకురావాలని కేంద్రం కోర్టును కోరింది. చాలా ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉన్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు.

Karvy MD Parthasarathy : కార్వీ ఎండీ, సీఎఫ్ఓ ఈడీ కార్యాలయానికి తరలింపు

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని గతేడాది అక్టోబర్​ 6న సుప్రీంకు కేంద్రం తెలిపింది. దీనికి పరిష్కారంగా సుప్రీంకోర్టే తగిన ప్రతిపాదనలు రూపొందించాలని కోరింది. గతేడాది అక్టోబర్​ 26న విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల కల్పనకు నిర్దిష్టమైన, కచ్చితమైన ప్రమాణాలు నిర్ధారించడంలో తాము జోక్యం చేసుకోలేమని కీలక తీర్పు వెలువరించింది.