Chhattisgarh : ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు వీడియో వైరల్

హనుమంతుడు గాలిలో ఎగుతున్నట్లు కనిపించే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డ్రోన్‌ల సాయంతో ఎగరేసిన విగ్రహాన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. ఎక్కడంటే?

Chhattisgarh :  ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు వీడియో వైరల్

Chhattisgarh

Updated On : October 27, 2023 / 2:49 PM IST

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్‌ల సాయంతో ఎగురుతున్న హనుమంతుడిని చూడటానికి జనం ఎగబడ్డారు.

Madurai : రజనీకాంత్‌కి గుడి కట్టిన అభిమాని.. 250 కిలోల విగ్రహానికి రోజూ పూజలు

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా వేడుకల సందర్భంగా డ్రోన్‌ల సాయంతో హనుమంతుడి విగ్రహాన్ని ఎగురవేశారు. హనుమంతుడు మనోహరంగా గాలిలో ఎగురుతూ ప్రజలను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంది. వీడియోను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో వినల్ గుప్తా అనే వ్యక్తి  పంచుకున్నారు, అతను ఫోటోగ్రాఫర్ మరియు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విశేషాలను పంచుకుంటూ ఉంటారు. అయితే ఇలా డ్రోన్‌లతో హనుమంతుడిని ఎగరవేయడం మొదటిసారి కాదు. 2015 లో యూట్యూబ్ లో ‘పవన్ పుత్ర హనుమాన్ (డ్రోన్) ఫ్లయింగ్ ఇన్ ది స్కై ఆఫ్ ఇండోర్’ అనే శీర్షికతో ఒకటి అప్పట్లో పోస్ట్ చేసారు.

Prabhas : ఆయన విగ్రహం చూసి షాక్ అయిన ప్రభాస్.. ఎవరిది ఆ విగ్రహం..?

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ 24 న విజయదశమి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రావణుడు, అతని కుమారుడు మేఘనాథుడు అతని సోదరుడు కుంభకర్ణుల భారీ దిష్టిబొమ్మలను ప్రజలు దహనం చేసారు.

 

View this post on Instagram

 

A post shared by Surgujawale (@surguja_wale_)