Fifa world cup 2022: ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు: ముస్లిం మతబోధకుడు

కేరళలోని ముస్లిం మత బోధకుడు షాజిద్ రషీదీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమస్థ కేరళ జామ్-ఇయ్యాతుల్ ఉలామా విడుదల చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. ‘‘ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు. ఒకవేళ ఆ ఆట ఇస్లాంకు వ్యతిరేకమైతే ముస్లిం దేశ ఖతర్ సాకర్ ప్రపంచ కప్ కు ఎందుకు ఆతిథ్యమిస్తుంది. ఒకవేళ ఆ ఆట ఇస్లాంకు వ్యతిరేకమైతే ఖతర్ కు వ్యతిరేకంగా ప్రకటన చేయాలి. ఫుట్‌బాల్ ఒక ఆట.. ప్రతి ఒక్కరూ దానిపై ఆసక్తి కనబర్చవచ్చు’’ అని చెప్పారు.

Fifa world cup 2022: ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు: ముస్లిం మతబోధకుడు

FIFA World Cup 2022

Fifa world cup 2022: ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదని కేరళకు చెందిన ఓ ముస్లిం మతబోధకుడు చెప్పారు. ఆ ఆటపై ఇటీవల కేరళలోని కొన్ని ముస్లిం సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ ఇస్లాంకు వ్యతిరేకమని మండిపడ్డాయి. సాకర్ ప్రపంచ కప్ లో పోర్చుగల్ ఉండడం, గతంలో ఇస్లాం దేశాలపై పోర్చుగల్ కొనసాగించిన ఆధిపత్యమే అందుకు కారణం. ఫుట్‌బాల్ కు వ్యతిరేకంగా కేరళలోని సమస్థ కేరళ జామ్-ఇయ్యాతుల్ ఉలామా ఇటీవలే ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

Marburg virus: ఈ వైరస్‌ను కట్టడి చేయండి.. లేదంటే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ముస్లిం యువకుల్లో సాకర్ పై ఉన్న క్రేజ్ పై విమర్శలు గుప్పించింది. దీనిపై తాజాగా, కేరళలోని ముస్లిం మత బోధకుడు షాజిద్ రషీదీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమస్థ కేరళ జామ్-ఇయ్యాతుల్ ఉలామా విడుదల చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. ‘‘ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు. ఒకవేళ ఆ ఆట ఇస్లాంకు వ్యతిరేకమైతే ముస్లిం దేశ ఖతర్ సాకర్ ప్రపంచ కప్ కు ఎందుకు ఆతిథ్యమిస్తుంది. ఒకవేళ ఆ ఆట ఇస్లాంకు వ్యతిరేకమైతే ఖతర్ కు వ్యతిరేకంగా ప్రకటన చేయాలి. ఫుట్‌బాల్ ఒక ఆట.. ప్రతి ఒక్కరూ దానిపై ఆసక్తి కనబర్చవచ్చు’’ అని చెప్పారు.

మతపర అంశాలకు, ఆటగాడికి సంబంధం లేదని, అది అతడి వ్యక్తిగత అంశమని అన్నారు. ఓ దేశానికి మద్దతు తెలపడం, ఆ దేశ జెండాను పట్టుకోవడం వంటి అంశాలకు, మతానికి సంబంధం ఉండబోదని అన్నారు. అలాగే, పాకిస్థాన్ ప్రజలు భారత ఆటగాళ్లను ఇష్టపడవచ్చని, మన ప్రజలు పాక్ ఆటగాళ్లను కూడా ఇష్టపడవచ్చని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..