Unemployment Rate: ఏయే రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందో తెలుసా?

దేశంలో హర్యానాలో అత్యధికంగా 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ (32.8), రాజస్తాన్ (31.4), జార్ఖండ్ (17.3), త్రిపుర (16.3) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‭లో ఉన్నట్లు డేటా వెల్లడించింది. చండీగఢ్‭లో నిరుద్యోగ రేటు 0.4 శాతమని డేటా వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మేఘాలయ 2.0 శాతంతో తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది

Unemployment Rate: ఏయే రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందో తెలుసా?

These states in India have the highest unemployment rate

Unemployment Rate: మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీల మేనిఫెస్టోలో ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ ప్రస్తావన గురించి బోల్డ్ అక్షరాల్లో కనిపిస్తుంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ఎజెండాలో సైతం ప్రముఖంగానే ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ అప్పట్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్రమోదీ తెగ ప్రచారం చేశారు. కానీ, వాస్తవంలో పది శాతం కూడా అమలులోకి రాలేదని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన దేశ యువత.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17ను ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’గా యువత జరుపుకుంటోందంటే నిరుద్యోగం ఎంత పెద్ద సమస్యగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక దేశంలో నిరుద్యోగం గురించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో నిరుద్యోగిత రేటు 6.8శాతం ఉందట. అయితే ఈ రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో 6.3 శాతం నిరుద్యోగం ఉండగా.. పట్టణ ప్రాంతంలో 7.8 శాతం ఉందట. వాస్తవానికి గత నెలలో 8.28 శాతం ఉన్న దేశ నిరుద్యోగ రేటు ఒకే నెలలో 6.3 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు.

ఇక దేశంలో హర్యానాలో అత్యధికంగా 37.3 శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ (32.8), రాజస్తాన్ (31.4), జార్ఖండ్ (17.3), త్రిపుర (16.3) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ నిరుద్యోగం కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‭లో ఉన్నట్లు డేటా వెల్లడించింది. చండీగఢ్‭లో నిరుద్యోగ రేటు 0.4 శాతమని డేటా వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే మేఘాలయ 2.0 శాతంతో తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (6.0), తెలంగాణ (6.9) నిరుద్యోగ శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ డేటా పేర్కొంది.

Imran Khan: మోదీపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్