దొంగకు దురదొచ్చింది.. మాస్క్ తీసి గోక్కున్నాడు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు!!

దొంగకు దురదొచ్చింది.. మాస్క్ తీసి గోక్కున్నాడు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు!!

Thief Mask: కరోనా నిబంధనల రీత్యా సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తూ కళ్లు, నోరు, ముక్కు లాంటి అవయవాలను మాస్క్, కళ్లజోళ్లతో కప్పి ఉంచుతున్నాం. ఇది మనమంచికే అని చెప్తున్న పోలీస్ అధికారులకు కొత్త ఛాలెంజ్ వచ్చి పడింది. నేరస్థులు సైతం ఎంచక్కా మాస్క్ పెట్టుకుని పనులు కానిచ్చేస్తున్నారు. తమ చేతివాటం చూపిస్తూనే పబ్లిక్‌లో దర్జాగా తిరుగుతున్న దొంగల్ని పట్టుకోవడం సవాల్ గా మారింది.

ఇలా మాస్క్ లు పెట్టుకుని కోల్‌కతాలోని మాల్స్‌లలో లూటీ మొదలుపెట్టాడు. ఎంత తెలివైన పనిచేసినా ఏదో ఒక క్షణం పొరబాటు చేయకుండా ఉండడు కదా. అలా దురదతో మాస్క్ తీసి కాసేపు గోక్కుని మళ్లీ పెట్టుకున్నాడు. ఈ గ్యాప్ లోనే పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు.

రతన్ భట్టాచార్య అని గుర్తించి కోల్‌కతాలోని జింజిరా బజార్‌లో ఉండే వ్యక్తిగా గుర్తించారు. మహమ్మారి వల్ల సంక్షోభం రాకముందు వరకూ అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడట. అదే ఫాలో అవుతూ.. సిటీ మాల్స్‌లో దొంగతనాలు మొదలుపెట్టాడు.

2020 డిసెంబర్ 25న కిడ్డర్‌పూర్‌మాల్‌కు ఓ మహిళ షాపింగ్‌కు వెళ్లింది. ఆమె పరధ్యానంలో ఉండే సమయం కోసం వెయిట్ చేశాడు. అదే అదనుగా చూసుకుని రూ.99వేల 300 డబ్బులు ఉన్న పర్సును దొంగిలించాడు. దాంతో పాటు 10 యూఎస్ డాలర్లు కూడా ఉన్నాయని కంప్లైంట్ లో పేర్కొంది.

డబ్బులున్న పర్సు తీసుకుని వెళ్లబోతూ దురద వచ్చి మాస్క్ తీసి గోక్కున్నాడు. క్షణాల వ్యవధిలోనే మళ్లీ మాస్క్ వేసేసుకున్నాడు. అయితే అప్పటికే అక్కడ ఉంచి సీసీటీవీ కెమెరాల్లో సీన్ మొత్తం రికార్డ్ అయిందని తెలుసుకోలేకపోయాడు. పోలీసులు అతణ్ని ట్రాక్ చేసి న్యూ ఇయర్ రోజునే అరెస్టు చేశారు.