వృద్ధులు ఇంట్లో ఉండే ఓట్ వేయొచ్చు

పలు కారణాలుగా ఓటు వేయలేకపోతున్న వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు. రైల్వే, రాష్ట్ర రోడ్ రవాణాల్లో ఇరుక్కుపోయి..

వృద్ధులు ఇంట్లో ఉండే ఓట్ వేయొచ్చు

పలు కారణాలుగా ఓటు వేయలేకపోతున్న వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు. రైల్వే, రాష్ట్ర రోడ్ రవాణాల్లో ఇరుక్కుపోయి..

ఓటు వేసేందుకు ఇకపై వృద్ధులు వీల్ చైర్లలో వచ్చి పడిగాపులు గాసే పని లేదు. ఎలక్షన్ కమిషన్ సలహా మేరకు ప్రభుత్వం దీనికి అనుగుణమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అంటే వీరంతా పోస్టల్ బ్యాలెట్ సహాయంతో ఓటు వేయొచ్చు. 

పలు కారణాలుగా ఓటు వేయలేకపోతున్న వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు. రైల్వే, రాష్ట్ర రోడ్ రవాణాల్లో ఇరుక్కుపోయిన వారి ఓట్లను వృథా కాకూడదనే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేర లా అండ్ జస్టిస్ మినిస్ట్రీని దీని గురించి ఆలోచించాలని 2019 సెప్టెంబర్ 2న కోరింది. దీంతో అక్టోబరు 22న కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సలహాకు అనుగుణంగా నియమాలను సవరించింది. 

కొత్తగా వచ్చిన నియమాల ఆధారంగా వృద్ధులు, లేదా అంగవైకల్యం ఉన్న వారు ముందుగా వారి లోపాలను ధ్రువీకరించుకోవాలి. ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి. పీడబ్ల్యూడీ(పర్సన్ విత్ డిజెబిలిటీ)తో పాటు సీనియర్ సిటిజన్ అంటే 80ఏళ్లు పైబడిన వృద్ధులు అని. వీళ్లను గైర్హాజరీ ఓటర్లు కింద పరిగణిస్తారు.