బీహార్ ని “బీమారు”గా మార్చినోళ్లకు ఓటు వేయొద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2020 / 09:41 PM IST
బీహార్ ని “బీమారు”గా మార్చినోళ్లకు ఓటు వేయొద్దు

Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి ముందు ఇటీవల కన్నుమూసిన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్,మాజీ ఆర్జేడీ లీడర్ రఘువన్ష్ ప్రసాద్ సింగ్, పుల్వామా,గల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహారీలకు మోడీ నివాళులర్పించారు.



ఈ సందర్భంగా ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై ప్రధాని విమర్శలు గుప్పించారు. బీహార్ ని “బీమారు”గా మార్చిన చరిత్ర ఉన్న పార్టీలకు ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని మోడీ అన్నారు. బీహార్ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముందే చాలా సర్వేలు బీహార్ లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తున్నట్లు చెప్పాయని…బీహార్ ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనే విషయంలో క్లియర్ గా ఉన్నారని ప్రధాని అన్నారు. భారత్ గుండె బీహార్..భారత గౌరవం,గర్వకారణం బీహార్…భారత సంప్రదాయం బీహార్..ఆత్మనిర్భర్ భారత్ ఫ్లాగ్ షిప్ బీహార్ అని ప్రధాని తెలిపారు.



బీహార్ ప్రజలు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేస్తుంటారని… సూర్యాస్తమయం అంటే పనులన్నీ నిలిపివేయబడాలని బీహార్ వాసులు మర్చిపోకూడదని మోడీ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లోని సాధారణ ప్రజలు భయపడకుండా జీవించేలా లైట్లు.రోడ్లు మరీ ముఖ్యంగా అలాంటి వాతావరణం ఉందని మోడీ తెలిపారు.

విపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్ లో మళ్లీ ఆర్టికల్-370ని తీసుకురాలని డిమాండ్ చేస్తున్నాయని…భారతదేశాన్ని బలహీనపర్చాలని కుట్రపన్నుతున్న వారి పక్షాన విపక్షాలు నిలిచాయని మోడీ విమర్శించారు. దళారీల కోసమే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు.



బీహార్ లో కరోనా కట్టడి చేసేందుకు సీఎం నితీష్ తీసుకున్న చర్యలపై మోడీ ప్రశంసలు కురిపించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం వేగంగా స్పందిచకున్నట్లయితే…మరణాల సంఖ్య అధికంగా ఉండి ఉండేదని మోడీ అన్నారు. ప్రస్తుతం బీహార్..కరోనాతో యుద్ధం చేస్తూనే దసరా ఫెస్టివల్ ని జరుపుకుంటోందని అన్నారు. జంగిల్ రాజ్ కావాలా లేక సుహాసన్ కావాలా ఆలోచించుకొని బీహారీలు ఓటు వేయాలని మోడీ కోరారు.

కాగా, 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్-28న మొదటి దశలో భాగంగా 71స్థానాలకు పోలింగ్ జరుగనుండగా..నవంబర్-3న రెండో దశలో భాగంగా 94స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఇక మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది.