A complete meal : భారతీయ ‘థాలి‘పై జొమాటో ట్వీట్

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 07:18 AM IST
A complete meal  : భారతీయ ‘థాలి‘పై జొమాటో ట్వీట్

భారతదేశం దేశం విభిన్న మతాల.. కలయిక. అంతేకాదు..భారతీయులు తినే ఆహారంలో కూడా ఒక్కో  రాష్ట్రానికి ఒక్కో రకమైన అలవాట్లు ఉన్నాయి. దేని రుచి దానిదే. భారత్ లో ఉండే రుచుల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రుచి అన్నట్లుగా ఉంటుంది. ఆయా ప్రాంతాల రుచులు ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లను ‘భారతీయ థాలి’ అద్దం పడుతుంది. 

భారత్ లో ఉండే రాష్ట్రాల వారు వేరే రాష్ట్రానికి వెళితే..ఆ ప్రాంతపు థాలిలను తింటుంటారు. అలా తినటం వల్ల ఆయా ప్రాంతాల రుచులను తెలుసుకోవచ్చు. అలా థాలిలను తిని ఆయా ప్రాంతాల్లోని వంటకాలను ఆస్వాదిస్తుంటారు. 

భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఉండే రుచుల గురించి..భారతీయ థాలిపై ట్విట్టర్ యూజర్ వందన జయరాజన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.  భారతీయ థాలి చారిత్రాత్మకమైనదనీ..ఇది ఒక సాంస్కృతిక అన్వేషణ. భారతీయ థాలి సంపూర్ణ  భోజనం, ప్రతి ప్రాంతానికి థాలిపై తనదైన శైలి ఉంటుంది. ఆయా ప్రాంతాల రుచులు భారత్ లోని ప్రతీ ప్రాంతంలోని తమ ముద్ర ఉంటుంది. ఆయా రుచులకు భారతీయ థాలి ప్రతిబింభిస్తుంటుంది అని తెలిపారు. 

ఒక రాష్ట్ర వంటకాలను విస్తృతంగా అన్వేషించడానికి థాలి తినడం ఉత్తమ మార్గం అని అన్నారు. మీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయా ప్రాంతంలోని థాలి గురించి మనకు తెలుస్తుంది. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాల వారు స్థానిక మెనూతో పళ్ళెంతో స్వాగతం పలుకుతారు. కొత్త రుచులను అన్వేషించడానికి..ఆయా ప్రాంతాల వంటకాల గురించి తెలుసుకోవటానికి భారతీయ థాలి  ఉత్తమ మార్గం అని పేర్కొన్నారు. 

వందనా జయరాజన్ చేసిన ట్వీట్ పై జోమాటో కూడా తన పోస్ట్‌ను రీట్వీట్ చేసింది. ఇది  కేవలం థ్రెడ్ మాత్రమే కాదు..ప్రతి ఒక్కరూ తినవలసిన పదార్ధాల లిస్టు. మేము 100 శాతం అంగీకరిస్తున్నాము అని తెలిపింది. 

ప్రతి రాష్ట్రం యొక్క తాలిలో ఏ వంటకాలు తయారవుతాయో..అవి ఈ ప్రాంతంలో ఎందుకు ప్రసిద్ది చెందాయో వందన సరిగ్గా వివరించారు. అస్సామీ థాలి, ఆంధ్ర తాలి, కాశ్మీరీ థాలి, బెంగాలీ థాలి, బిహారీ థాలి, ఒడియా థాలి, పంజాబీ థాలి మరియు మరెన్నో గురించి చాలా చక్కగా వివరించారు వందనా జయరాజన్.