Gold Rate: బంగారం ధర కాస్త తగ్గిందన్నమాట..

క్రమంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్.. బుధవారానికి ఎక్కువ ధర పలుకగా గురువారం కాస్త పరవాలేదనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.319లు తగ్గడంతో 48వేల 223కు దిగొచ్చింది.

Gold Rate: బంగారం ధర కాస్త తగ్గిందన్నమాట..

Gold Rate

Gold Rate: క్రమంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్.. బుధవారానికి ఎక్కువ ధర పలుకగా గురువారం కాస్త పరవాలేదనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.319లు తగ్గడంతో 48వేల 223కు దిగొచ్చింది.

బంగారంతో పాటు వెండి కూడా అదే బాటలో పయనించి.. కిలో ధరపై రూ.1287 తగ్గి ప్రస్తుతం 71వేల 924కి చేరింది. బుధవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.48వేల 542గా వరకూ చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి 1900 డాలర్లు పలుకుతుండగా.. ఔన్సు వెండి ధర 27.70 డాలర్లుగా ట్రేడవుతున్నట్టు వెల్లడించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరగడం వల్లే పసిడి ధరలో తగ్గుదల నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్ట్ తపన్‌ పటేల్‌ విశ్లేషించారు.

హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారు రూ.50వేల 395గా(అన్ని పన్నులతో కలిపి) పైగా ట్రేడ్‌ అవుతోంది.