Rahul Gandhi: కేంద్రంపై రాహుల్ సెటైర్లు : స్టేజ్-1 తుగ్లక్ లాక్‌డౌన్,స్టేజ్-2 గంట కొట్టడం,స్టేజ్-3 దేవుడిని ప్రార్ధించడం

కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi: కేంద్రంపై రాహుల్ సెటైర్లు : స్టేజ్-1 తుగ్లక్ లాక్‌డౌన్,స్టేజ్-2 గంట కొట్టడం,స్టేజ్-3 దేవుడిని ప్రార్ధించడం

Rahul Gandhi

Rahul Gandhi కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ విషయంలో కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడుతున్న రాహల్ గాంధీ.. మహమ్మారి కట్టడి కోసం కేంద్రప్రభుత్వం‘‘తుగ్లక్ లాక్‌డౌన్, గంటలు మోగించడం, దేవుడ్ని ప్రార్థించడం’’ వంటి వ్యూహాలను అనుసరిస్తోందని రాహుల్ గాంధీ శుక్రవారం ఓ ట్వీట్ లో తెలిపారు.

దేశంలో రికార్డు స్థాయిలో శుక్రవారం 2,17,353 కొవిడ్‌ కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు 1.43 కోట్లకు చేరుకుంది. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఓ ట్వీట్ లో రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వ కోవిడ్ వ్యూహం.. స్టేజ్-1 తుగ్లక్ లాక్‌డౌన్ విధించడం.. స్టేజ్-2 గంట మోగించడం.. స్టేజ్-3 దేవుడిని ప్రార్ధించడం అంటూ ఎద్దేవా చేశారు. గతేడాది కరోనా కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో పాటు.. చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి కరోనా వారియర్స్‌కు మద్దతు నిలువాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విమర్శలు గుప్పించారు.

కాగా, ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వం చేపట్టిన కొవిడ్‌ నియంత్రణ చర్యలు, టీకా పంపిణీ, కేంద్రం నిర్ణయాలను చాలా సార్లు తప్పుపట్టింది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో తీసుకున్న నిర్ణయంపై కూడా రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు. తరవాత నవ్వుతారు. మీతో పోరాడతారు. చివరికి మీరే గెలుస్తారు’ అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్- వీ టీకాను భారత్ అత్యవసర వినియోగానికి ఆమోదించిన వార్తను షేర్ చేస్తూ రాహుల్ ఈ విమర్శలు చేశారు. కొద్దిరోజుల కిందటే రాహుల్ గాంధీ ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.