Covid-19 update : పోలీసుల దాడులు, 285 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల స్వాధీనం

గురువారం జరిపిన దాడుల్లో 285 డ్రగ్‌ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

Covid-19 update : పోలీసుల దాడులు, 285 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల స్వాధీనం

Covid-19

Remdesivir : భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే విధంగా చోటు చేసుకుంటున్నాయి. కరోనా చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. అయితే..కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ లు లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే..కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే యాంటీ వైరల్ డ్రగ్‌ రెమ్‌డెసివిర్ ను అక్రమంగా నిల్వ చేస్తూ..బ్లాక్ మార్కెట్ లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న ముంబై పోలీసులు 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం జరిపిన దాడుల్లో 285 డ్రగ్‌ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రాణాలను రక్షించే ఈ డ్రగ్ కోసం అధిక డిమాండ్ ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్‌ రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్ లో రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు విక్రయిస్తారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ముంబైలోని Jogeshwari ప్రాంతంలో జీఆర్ ఫార్మా అవుట్ లెట్ వద్ద దాడులు నిర్వహించారు. మొత్తం 285 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇంజక్షన్లను ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో..స్వాధీనం చేసుకున్న వీటిని..త్వరగా ఆసుపత్రులకు పంపిణీ చేయాలని ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ నిర్ణయం తీసుకుంది. తక్కువ సరఫరా ఉన్న డ్రగ్‌ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఎలా సేకరించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఇతర దేశాలు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఎదుర్కొంటున్నాయి. కొరత ఫలితంగా..బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని భావిస్తున్నారు.

కరోనా చికిత్సకు పలు దేశాలు ఈ యాంటీ వైరల్ డ్రగ్ నే వినియోగిస్తున్నాయి. కరోనా వైరస్‌ చికిత్సలో ఇది ఎంతో ప్రభావితంగా పనిచేస్తుందని నమ్ముతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Read More : Fertilisers : పెట్రో ధరల ఎఫెక్ట్.. రైతుల నెత్తిన పిడుగు.. భారీగా పెరిగిన ఎరువుల ధరలు