UP Building Collapses : మూడంతస్తుల భవనం కూలి ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని బారాబంకీ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు....

UP Building Collapses : మూడంతస్తుల భవనం కూలి ఇద్దరి మృతి

UP Building Collapses

Updated On : September 4, 2023 / 1:24 PM IST

UP Building Collapses : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని బారాబంకీ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. (Three Storey Building Collapses) భారీవర్షాల వల్ల పురాతన భవనం కూలిందని పోలీసులు చెప్పారు.

IndiGo flight : పక్షిని ఢీకొన్న ఇండిగో విమానం…భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని బారాబంకి పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటలకు జరిగిందని, ఇప్పటివరకు 12 మందిని రక్షించామని అందులో ఇద్దరు మరణించారని సింగ్ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలంలో ఉందని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అక్కడికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

Zelensky : జెలెన్స్కీ సంచలన నిర్ణయం…యుక్రెయిన్ కొత్త రక్షణ మంత్రి నియామకం

మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని, శిథిలాలను తొలగిస్తున్నామని పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో నివాస భవనం కుప్పకూలిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. థానేలో ఒక శిశువు, ఒక మహిళ మరణించారు, మరో ఐదుగురు గాయపడ్డారు.