Shivsena Symbol Row: నేడు సీఎం షిండే వర్గం వంతు .. మూడు పేర్లు, గుర్తులతో ఈసీకి జాబితాను సమర్పించిన ఉద్ధవ్ థాకరే వర్గం..

నవంబర్ 3న జరిగే అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉప ఎన్నికకోసం గుర్తును ఖరారు చేసేందుకు త్రిశూలం, మండే జ్యోతి, ఉదయించే సూర్యుడు వంటి మూడు గుర్తులను ఎన్నికల కమిషన్‌కు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం సమర్పించింది. ఈరోజు సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం తమకు కావాల్సిన గుర్తులు, పేర్లను ఈసీకి సమర్పించే అవకాశం ఉంది.

Shivsena Symbol Row:  నేడు సీఎం షిండే వర్గం వంతు .. మూడు పేర్లు, గుర్తులతో ఈసీకి జాబితాను సమర్పించిన ఉద్ధవ్ థాకరే వర్గం..

Shivsena Symbol Row

Shivsena Symbol Row: శివసేన సింబల్ కోసం ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీకి చెందిన ’విల్లు, బాణం’ గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసింది. అయితే, నవంబర్ 3న పోలింగ్ జరిగే ముంబైలోని అంథేరి ఈస్ట్ ఉప‌ఎన్నికకు కొత్త గుర్తులకోసం దరఖాస్తు చేసుకోవాలని ఇరు వర్గాలకు ఈసీ సూచించింది. దీంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం మహారాష్ట్రలో ఉప‌ఎన్నికకు ఆదివారం ఎన్నికల కమిషన్‌కు మూడు పేర్లు, గుర్తులను సమర్పించింది.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంకు సీఎం కేసీఆర్.. 30న చండూరులో బహిరంగ సభ..

నవంబర్ 3న జరిగే అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉప ఎన్నికకోసం గుర్తును ఖరారు చేసేందుకు త్రిశూలం, మండే జ్యోతి, ఉదయించే సూర్యుడు వంటి మూడు గుర్తులను ఎన్నికల కమిషన్‌కు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం సమర్పించింది. అంతేకాకుండా మూడు పేర్లను సైతం సమర్పించింది. వాటిలో శివసేన బాలాసాహెబ్ థాకరే, శివసేన బాలాసాహెబ్ ప్రబోధంకర్ థాకరే, శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే” అనే మూడు పేర్లు ఈసీ సమర్పించారు. వీటిలో ఏదైనా గుర్తు, పేరును తమకు కేటాయించాలని ఉద్ధవ్ థాకరే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అంతకుముందు విల్లు, బాణం గుర్తులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈసీ ప్రకటన చేయడాన్ని ఉద్ధవ్ వర్గం తప్పుబట్టింది. ఇది అన్యాయమని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇదిలాఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రత్యర్థి శిబిరం కూడా నేడు (సోమవారం) తమకు కావాల్సిన గుర్తు, పేరుకోసం నూతన గుర్తులు, పేర్లను ఎన్నికల కమిషన్‌ సమర్పించనున్నట్లు తెలిసింది. ఉప ఎన్నికకోసం షిండే వర్గం కత్తి, బాకా, గద్దెలనే తమ ఎంపికలుగా పరిగణిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ పేర్ల ప్రకారం, రెండు వర్గాలు ఒకే ఎంపికలను జాబితా చేసే అవకాశం ఉంది. ఈసీకి సమర్పించే ఎంపికలలో ‘శివసేన బాలాసాహెబ్ థాకరే’, ‘శివసేన బాలాసాహెబ్ ప్రబోధంకర్ థాకరే’ వంటి పేర్లను కూడా షిండే వర్గం పరిశీలిస్తోందని తెలుస్తోంది. మరి నేడు షిండే వర్గం ఉప ఎన్నికకోసం ఏ గుర్తు, పేర్లను ఈసీకి సమర్పింస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.