Union Cabinet Decisions : గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటగ్యాస్ ధరలు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet Decisions : ఇక నెలవారీగా గ్యాస్ ధరలు నిర్ణయిస్తారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు రిలీఫ్ అందించడానికి..

Union Cabinet Decisions : గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటగ్యాస్ ధరలు, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet Decisions (Photo : Google)

Union Cabinet Decisions : కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలు ఆమోదించింది కేంద్ర మంత్రివర్గం. దీంతో వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్ తో అనుసంధానం కానున్నాయి. సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది.

స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానం అమలు చేయనుంది. ఇక నెలవారీగా గ్యాస్ ధరలు నిర్ణయిస్తారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు రిలీఫ్ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.(Union Cabinet Decisions)

Also Read..World Billionaires 2023: ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ముఖేష్ అంబానీ.. గౌతమ్ అదానీ ఏ స్థానంలో ఉన్నాడంటే?

భారత అంతరిక్ష విధానం 2023కి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానంతో అంతరిక్షశాఖ పాత్ర మెరుగు కానుంది. అలాగే, ఇస్రో మిషన్ల కార్యకలాపాలు పెరగనున్నాయి. పరిశోధన, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు పరిశ్రమల పెద్ద భాగస్వామ్యాన్ని అందించడం లక్ష్యంగా భారత అంతరిక్ష విధానం 2023కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అటు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. డీఏను 4 పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం 38శాతంగా ఉన్న డీఏ 42శాతానికి పెరగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.12వేల 815 కోట్ల భారం పడనుంది.

“కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ అదనపు వాయిదా విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ అదనపు వాయిదా 01.01.2023 నుండి అమల్లోకి వస్తుంది. ధరల పెరుగులతో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డీఏ రేటు 38 శాతంగా ఉంది. ఇప్పుడు 4 శాతం పెరిగి 42శాతం అవుతుంది.

Also Read..RBI Repo Rate: కాస్త ఉపశమనం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం..

డియర్‌నెస్ అలవెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి ప్రస్తుత జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి చెల్లించే జీతంలో ఒక భాగం. ఇది ఉద్యోగి యొక్క ప్రాథమిక జీతంలో ఒక శాతంగా లెక్కించబడుతుంది. పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారు ధర సూచిక (CPI-IW)పై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ లేబర్ బ్యూరో ప్రతి నెలా CPI-IW డేటాను ప్రచురిస్తుంది.