RBI Repo Rate: కాస్త ఉపశమనం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం..

గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వేగంగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తుంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది.

RBI Repo Rate: కాస్త ఉపశమనం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం..

RBI Governor Shaktikanta Das

RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మెజార్టీ నిపుణుల అంచనాలకు భిన్నంగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేపొరేటు (Repo Rate)  6.50శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das)  గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) లోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు సమర్థించినట్లు పేర్కొన్నారు.

RBI Hikes Repo Rate: సామాన్యులకు షాక్.. మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ .. పెరగనున్న లోన్ ఈఎంఐలు

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా గత ఏడాదిగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. ఈనెల 3న ద్రవ్యపరపతి విధాన సమావేశం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే 2023-24లో ఇదే ప్రథమ ద్రవ్యపరపతి విధాన సమీక్ష. అధిక ద్రవ్యోల్బణాన్ని పరిష్కారమార్గంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 25 బేసిన్ పాయింట్లు ( 6.75శాతం) పెంచుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. రెపోరేటులో ఎలాంటి మార్పులు లేకుండా 6.5శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశం లేకపోవటంతో సామాన్యలకు ఊరట కాస్త ఉపశమనం కల్పించినట్లయింది.

RBI Hikes Repo Rate: సామాన్యులపై మళ్లీ భారం.. రెపోరేటు 35 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ

గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వేగంగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తుంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ నిర్ణయించిన రెపో రేటు నేరుగా బ్యాంకు రుణంపై ప్రభావం చూపుతుంది. వాస్తవానికి రెపోరేటు బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ఇది తగ్గినప్పుడు రుణం చౌకగా మారుతుంది. అది పెరిగిన తరువాత బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేటును పెంచుతాయి. అన్ని రకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఈఎంఐ భారం కూడా పెరుగుతుంది.

 

2022 మే నెల నుంచి రెపోరేటు పెంపు వివరాలు చూస్తే..

2022 మే – 0.40శాతం

2022 జూన్ – 0.50శాతం

2022 ఆగస్టు – 0.50శాతం

2022 సెప్టెంబర్ – 0.50శాతం

2022 డిసెంబర్ – 0.35శాతం

2023 ఫిబ్రవరి – 0.25శాతం.