RBI Hikes Repo Rate: సామాన్యులపై మళ్లీ భారం.. రెపోరేటు 35 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.

RBI Hikes Repo Rate: సామాన్యులపై మళ్లీ భారం.. రెపోరేటు 35 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఆర్‌బీఐ

RBI

RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక ఆందోళనల నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా కేంద్ర బ్యాంకు రెపోరేటును ఇప్పటి వరకు ఈ ఏడాది 225 పాయింట్లు పెంచింది. దీంతో మే నెలలో 4.4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు ఇప్పుడు 6.25 శాతానికి చేరింది.

RBI: మరోసారి సామాన్యులకు ఆర్బీఐ షాక్..?

ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపోరేటు 2018 ఆగస్టు నాటి స్థాయికి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థ పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన స్థాయిలో ఉందని తెలిపారు. ద్రవ్వోల్బణం మరికొంత కాలం లక్షిత 4 శాతానికి ఉండనుందని దాస్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ పోరాటం మాత్రం ఇంకా ఆగలేదని శక్తికాంతదాస్ అన్నారు.

RBI Hikes Repo Rate: రుణగ్రహీతలకు షాక్.. మరోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ..

ఇదిలాఉంటే భారత స్టాక్ మార్కెట్ సూచీలపై అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ప్రభావం చూపుతున్నాయి. ఆరంభంలో లాభాల్లో ట్రేడయిన సూచీలు తర్వాత నష్టపోయాయి. ఇందుకారణం అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడం కూడా కారణంగా తెలుస్తోంది. మరోవైపు బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం ఎలాంటి ఒడుదొడుకులకు లోనవ్వలేదు. ఇంకా పుంజుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు దుమ్మురేపుతున్నాయి. వీటిపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుండటంతో మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఇవి అన్నీ దాదాపు 52 వారాల గరిష్ట విలువల్లో ట్రేడవుతున్నాయి.